ఎన్నికలు వాయిదా వేయండి: ఈసీకి పంజాబ్ సీఎం లేఖ

ABN , First Publish Date - 2022-01-16T16:14:31+05:30 IST

పంజాబ్ అసెంబ్లీ ఎన్నికలు కనీసం ఆరు రోజుల పాటు వాయిదా వేయాలని భారత..

ఎన్నికలు వాయిదా వేయండి: ఈసీకి పంజాబ్ సీఎం లేఖ

చండీగఢ్: పంజాబ్ అసెంబ్లీ ఎన్నికలు కనీసం ఆరు రోజుల పాటు వాయిదా వేయాలని భారత ఎన్నికల కమిషన్‌కు (ఈసీఐ) పంజాబ్ ముఖ్యమంత్రి చరణ్‌జిత్ సింగ్ చన్నీ విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు ఈసీకి ఆయన లేఖ రాశారు. షెడ్యూల్ ప్రకారం పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ఒకే విడతలో ఫిబ్రవరి 14న జరగాల్సి ఉంది.


యూపీలోని బనారస్‌లో ఫిబ్రవరి 10 నుంచి 16వ తేదీ వరకూ జరిగే శ్రీ గురు రవిదాస్ జయంతి కోసం పంజాబ్‌కు చెందిన షెడ్యూల్డ్ కులాల భక్తులు వెళ్తారని, రాష్ట్ర జనాభాలో ఎస్‌సీల జనాభా 32 శాతం ఉందని ఈసీ దృష్టికి ముఖ్యమంత్రి తీసుకువచ్చారు. దాదాపు 20 లక్షల మంది బనారస్ వెళ్లే అవకాశం ఉందని, ఇందువల్ల వీరంతా ఓటు హక్కును వినియోగించుకోలేకపోతారని అన్నారు. ఎన్నికలు వాయిదా వేయడం వల్ల అటు రవిదాస్ జయంతి ఉత్సవాలతో పాటు ఓటింగ్ ప్రక్రియలో పాల్గొనగలమని ఆ వర్గం ప్రజలు తనకు విజ్ఞప్తి చేసినట్టు చన్నీ చెప్పారు. వీరంతా తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు వీలుగా ఎన్నికలను కనీసం ఒక ఆరు రోజుల పాటు వాయిదా వేయాలని ఈసీకి రాసిన లేఖలో ముఖ్యమంత్రి పేర్కొన్నారు.

Updated Date - 2022-01-16T16:14:31+05:30 IST