ఉద్యోగులను నిలువునా ముంచిన సీఎం

ABN , First Publish Date - 2022-01-23T04:58:32+05:30 IST

పీఆర్‌సీ పేరుతో ఉద్యోగుల ను రెండేళ్లు ఊరించిన సీఎం జగన్‌ చివరకు భారతదేశ చరిత్రలో మరే ముఖ్యమంత్రీ చేయని విధంగా ఉద్యోగు లను నిలువునా ముంచారని టీడీపీ రాష్ట్ర కార్యదర్శి గా జుల ఖాదర్‌బాషా ధ్వజమెత్తారు.

ఉద్యోగులను నిలువునా ముంచిన సీఎం
విలేకరుల సమావేశంలో మాట్లాడుతున్న టీడీపీ రాష్ట్ర కార్యదర్శి గాజుల ఖాదర్‌బాషా

టీడీపీ రాష్ట్ర కార్యదర్శి గాజుల ఖాదర్‌బాషా

రాయచోటిటౌన్‌, జనవరి22: పీఆర్‌సీ పేరుతో ఉద్యోగుల ను రెండేళ్లు ఊరించిన సీఎం జగన్‌ చివరకు భారతదేశ చరిత్రలో మరే ముఖ్యమంత్రీ చేయని విధంగా ఉద్యోగు లను నిలువునా ముంచారని టీడీపీ రాష్ట్ర కార్యదర్శి గా జుల ఖాదర్‌బాషా ధ్వజమెత్తారు.శనివారం పార్టీ కార్యా లయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ రివర్స్‌ పీఆర్‌సీని ప్రకటించి ఉద్యోగులను మోసం చేశారన్నారు. టీడీపీ ప్రభుత్వం పెద్ద మనసుతో 43 శాతం ఫిట్‌మెం ట్‌తో పీఆర్‌సీ ఇస్తూ రూ. 4 వేల కోట్లు ఎరియర్స్‌ను కూడా చెల్లించిందన్నారు.

మోసపూరిత వాగ్దానాలతో ఉద్యోగులను వంచించిన జగన్‌ అధికారం చేపట్టాక కోత లు, వాతలతో వారికి కంటిపైన కునుకులేకుండా చేస్తు న్నారన్నారు. ఐఆర్‌ 23 శాతం ప్రకటించి, ఫిట్మెంట్‌లో నాలుగు శాతం కోత విధించడంతో ప్రతి ఉద్యోగికీ సర్వీ స్‌లో మూడు ఇంక్రిమెంట్లు ప్రత్యక్షంగా నష్టపోతున్నార న్నారు. దీంతో ప్రతి ఉద్యోగి తన సర్వీసులో సగటున రూ. 10 లక్షలకు పైగా నష్టపోయే అవకాశముంద న్నారు.

ఉద్యోగుల నోళ్లు కొట్టే ఈ మోసపూరిత పీఆర్‌సీ ని తీవ్రంగా వ్యతికిస్తూ తమ న్యాయమైన డిమాండ్ల కోసం ఉద్యోగులు చేసే పోరాటానికి టీడీపీ అండగా నిలుస్తుందన్నారు. సమావేశంలో టీడీపీ సీనియర్‌ నేత లు మోటకట్ల సుబ్బారెడ్డి, దుద్యాల హరినాధరెడ్డి, ఐటీడీ పీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి నాగేంద్ర, రాజంపేట పార్లమెంటరీ జిల్లా ఎస్టీ సెల్‌ ప్రధాన కార్యదర్శి రెడ్డెయ్య తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2022-01-23T04:58:32+05:30 IST