బతుకమ్మ సంబురాలకు సీఎం కృషి: ఎమ్మెల్యే

ABN , First Publish Date - 2022-10-02T04:47:05+05:30 IST

రాష్ట్రవ్యాప్తంగా మహిళలు బతుకమ్మ సంబురాలు నిర్వహించుకునేలా సీఎం కేసీఆర్‌ కృషి చేశారని ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి తెలిపారు.

బతుకమ్మ సంబురాలకు సీఎం కృషి: ఎమ్మెల్యే
దూళిమిట్టలో మహిళలతో కలిసి బతుకమ్మ ఆడుతున్న ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి

మద్దూరు, అక్టోబరు 1: రాష్ట్రవ్యాప్తంగా మహిళలు బతుకమ్మ సంబురాలు నిర్వహించుకునేలా సీఎం కేసీఆర్‌ కృషి చేశారని ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి తెలిపారు. శనివారం మద్దూరు మండలంలోని లద్నూరు, దూళిమిట్ట మండల కేంద్రంలో సర్పంచులు జీడికంటి సుదర్శన్‌, దుబ్బుడు దీపికావేణుగోపాల్‌రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన బతుకమ్మ సంబరాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మహిళలతో కలిసి ఎమ్మెల్యే ఆడి మహిళలను ఉత్తేజపరిచారు. లద్నూరు, దూళిమిట్టలో బతుకమ్మలను అందంగా పేర్చుకుని తీసుకొచ్చిన చెప్పాల గాలమ్మ, కుమ్మరి బుచ్చమ్మ, కొమ్ము ప్రేమలకు బహుమతులు అందజేశారు. అనంతరం బతుకమ్మలను చెరువుల్లో నిమజ్జనం చేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు, మహిళలు పాల్గొన్నారు. 

హుస్నాబాద్‌: రాష్ట్రంలో బతుకమ్మ సంస్కృతిని కాపాడుకునేందుకు సమిష్టిగా కృషి చేయాలని సీపీఐ జిల్లా కార్యదర్శి మంద పవన్‌ పిలుపునిచ్చారు. శనివారం హుస్నాబాద్‌ పట్టణంలోని అనభేరి, సింగిరెడ్డిల అమరుల భవనంలో జాతీయ మహిళా సమాఖ్య జిల్లా సమితి ఆధ్వర్యంలో నిర్వహించిన బతుకమ్మ వేడుకలకు ఆయన హాజరై మాట్లాడారు. ఈ కార్యక్రమంలో సీపీఐ రాష్ట్ర సమితి సభ్యుడు గడిపె మల్లేశ్‌, నాయకులు కొమ్ముల భాస్కర్‌, సంజీవరెడ్డి, మహిళా సమాఖ్య జిల్లా అధ్యక్షురాలు గూడ పద్మ పాల్గొన్నారు. అలాగే హుస్నాబాద్‌ పట్టణంలోని ప్రభుత్వ బాలికల జూనియర్‌ కళాశాలలో బతుకమ్మ వేడుకలను జరుపుకున్నారు. ఈ సందర్భంగా బతుకమ్మ ఆట, పాటలతో అలరించారు. ఈ కార్యక్రమంలో కళాశాల ఇన్‌చార్జి ప్రిన్సిపాల్‌ డీ.రవీందర్‌, లెక్చరర్లు వరూధిని, ఎన్‌ఎ్‌సఎస్‌ ప్రోగ్రాం అధికారి కరుణాకర్‌, స్వరూప పాల్గొన్నారు.  

దౌల్తాబాద్‌: దౌల్తాబాద్‌ ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలో బతుకమ్మ సంబురాలను నిర్వహించారు. ప్రిన్సిపాల్‌ సురే్‌షరెడ్డి ఆధ్వర్యంలో పూజలు నిర్వహించి బతుకమ్మ సంబరాలను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఎన్‌ఎ్‌సఎస్‌ కో ఆర్డినేటర్‌ మంగ్తా నాయక్‌, సంపత్‌కుమార్‌, అధ్యాపకులు పాల్గొన్నారు.

గజ్వేల్‌ రూరల్‌: గజ్వేల్‌ మండలంలోని ఆయా గ్రామాల్లో శనివారం బతుకమ్మ సంబురాలను ఘనంగా నిర్వహించారు. మహిళలు, పిల్లలు పెద్దఎత్తున పాల్గొని ఆట, పాటలతో అలరించారు. 

Updated Date - 2022-10-02T04:47:05+05:30 IST