రైతు వేదికల ప్రారంభోత్సవానికి సీఎం?

ABN , First Publish Date - 2020-09-14T11:06:54+05:30 IST

రాష్ట్రవ్యాప్తంగా రైతుల సంక్షేమానికి ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపడుతోంది. రైతుల సమస్యలను, పంట ల సాగు, మద్దతు ధర లాంటి వాటిపై చర్చించుకునేం దుకు రైతులకు ప్రత్యేక వేదికను

రైతు వేదికల ప్రారంభోత్సవానికి సీఎం?

సీఎంను ఆహ్వానించనున్న జిల్లా ప్రజాప్రతినిధులు

ప్రారంభోత్సవానికి సమయం ఇవ్వాలంటూ కేసీఆర్‌ను కోరిన జిల్లా నేతలు

ఒకే రోజు 104 వేదికలు సీఎం చేత ప్రారంభించేందుకు ఏర్పాట్లు

జిల్లాలో ఇప్పటికే పూర్తయిన 70 వేదికల నిర్మాణాలు

ఈ నెల 20లోగా అన్ని నిర్మాణాలు పూర్తి చేసేందుకు అధికారుల కసరత్తు

వేదికల నిర్మాణాలపై కలెక్టర్‌ శరత్‌ ప్రత్యేక దృష్టి


కామారెడ్డి, సెప్టెంబరు 13 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రవ్యాప్తంగా రైతుల సంక్షేమానికి ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపడుతోంది. రైతుల సమస్యలను, పంట ల సాగు, మద్దతు ధర లాంటి వాటిపై చర్చించుకునేం దుకు రైతులకు ప్రత్యేక వేదికను ఏర్పాటు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం రైతు వేదికల నిర్మాణాలు చేపడుతోంది. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాలో వేదికల నిర్మాణ పనులను ప్రారంభించాయి. అయితే రాష్ట్రంలోనే మొదటగా రైతు వేదికల నిర్మాణాలను పూర్తి చేసి ప్రారంభించేందుకు కామారెడ్డి జిల్లా ప్రజాప్రతినిధులు ఉన్నతాధికారులు కలిసికట్టుగా పర్యవేక్షిస్తున్నారు. జిల్లాలో వేదికల నిర్మాణానికి భూమి పూజ ప్రజాప్రతినిధులు కలిసికట్టుగా ఒకే సారి చేపట్టారు. నిర్మాణాలు దాదాపు చివరి దశకు చేరుకున్నందున వీటన్నింటిని ఒకే రోజు ప్రారంభి ంచేందుకు ఉన్నతాధికారులు చర్యలు చేపడుతున్నారు. ప్రధానంగా జిల్లా కలెక్టర్‌ శరత్‌ వేదికల నిర్మాణ పనులను విజయవంతం చేసేలా ప్రతీ రోజు పర్యవేక్షిస్తున్నారు.


వేదికల ప్రారంభానికి సీఎం కేసీఆర్‌ను ఆహ్వానించనున్న జిల్లా నేతలు

జిల్లాలోని 104 రైతువేదికలను సీఎం చేతుల మీదుగా ప్రారంభించాలని జిల్లా ప్రజాప్రతినిధులతో పా టు ఉన్నతాధికారులు భావిస్తున్నారు. స్పీకర్‌ పోచారం శ్రీనివాస్‌రెడ్డితో పాటు ఇన్‌చార్జ్‌ మంత్రి ప్రశాంత్‌రెడ్డి, ప్రభుత్వ విప్‌ గంప గోవర్ధన్‌, ఎంపీ బీబీపాటిల్‌, ఎమ్మెల్యేలు హన్మంత్‌షిండే, నల్లమడుగు సురేందర్‌ ఇప్పటికే సీఎం కేసీఆర్‌ను కలిసి రైతు వేదికల నిర్మాణాల పనుల పురోగ తిపై వివరించినట్లు తెలిసింది. ప్రజాప్రతినిధులమందరం కలిసి కట్టుగా జిల్లాలోని అన్ని వేదికల నిర్మాణ భూమి పూజ ఒకే రోజు చేయడం జరిగి ందని సీఎం దృష్టికి తీసుకెళ్లినట్లు సమాచారం. వేదికల నిర్మాణాలు దాదాపు పూర్తికావస్తున్నందున ఈ నెల చివరికల్లా సీఎంను ఆహ్వానించి ఒకే రోజు 104 వేదికలను ప్రారంభించాలని ప్రజాప్రతినిధులు సీఎంను కోరినట్లు తెలిసింది. వేదికల ప్రారంభోత్సవానికి సమయం ఇవ్వాలని సీఎం కేసీఆర్‌ను ప్రజాప్రతినిధులు కోరినట్లు సమాచారం.


జిల్లాలో వేదికల ప్రారంభోత్సవానికి చర్యలు

రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం రైతువేదికల నిర్మాణాలు చేపడుతున్న విష యం తెలిసిందే. ఇందులో భాగంగానే కామారెడ్డి జిల్లాలోనూ 22 మండ లాల్లో 526 గ్రామ పంచాయతీ పరిధిలోని వ్యవసాయక్లస్టర్‌లలో 104 వేదికల నిర్మాణ పనులు నెల రోజుల నుంచి శరవేగంగా కొనసాగుతున్నా యి. వేదికల నిర్మాణ పనులు ప్రారంభించిన పది రోజుల వ్యవఽధి కాలం లోనే రాష్ట్రంలోనే బాన్సువాడ నియోజకవర్గ పరిధిలోని బీర్కూర్‌ మండ లం రైతునగర్‌లో మొట్టమొదటి వేదిక భవన నిర్మాణాన్ని పూర్తి చేశారు. జిల్లాలోని 104 వేదికల నిర్మాణ పనులు పూర్తిచేసి ఒకేసారి ప్రారంభించి రాష్ట్రంలోనే జిల్లా రికార్డు సృష్టించాలని ఆలోచనతో ఉన్నతాధికారులు ఉన్నారు. ఇందులో భాగంగానే నిర్మాణ పనులు వేగంగా సాగేలా ప్రతీ భవనానికి జిల్లా స్థాయి అధికారులను ఏర్పాటు చేసి వేగంగా జరిగేలా చేస్తున్నారు. ఇప్పటికే 70 రైతు వేదికల నిర్మాణ పనులు పూర్తయినట్లు జిల్లా అధికారులు పేర్కొంటున్నారు. ఈ నెల 20 వరకు 104 నిర్మాణ పనులు పూర్తి చేసి సీఎం కేసీఆర్‌ చేత ప్రారంభించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.


రైతు వేదికల నిర్మాణంపై కలెక్టర్‌ ప్రత్యేక దృష్టి

రైతువేదికల నిర్మాణాలు జిల్లాలో చకచక జరుగుతున్నాయి. కలెక్టర్‌ శరత్‌ ప్రత్యేక చొరవ తీసుకుంటూ నిత్యం ఆయా మండలాల్లోని రైతు వేదికలను సందర్శిస్తూ మండలాల అధికారులకు, కాంట్రాక్టర్‌లకు పలు సూచనలు చేస్తుండడం పనుల్లో  వేగిరం పెంచాలని ఆదేశాలు ఇస్తుండ డంతో నెలరోజుల్లో 526 గ్రామ పంచాయతీ పరిధిలోని క్లస్టర్‌లలో వీటి నిర్మాణాలు జోరుగా సాగుతున్నాయి. ముఖ్యమంత్రి కేసీఆర్‌ రైతు వేదిక ల నిర్మాణాలకు ప్రత్యేక చొరవ చూపడంతో జిల్లా కలెక్టర్‌లు తమ పరిధి లో రైతువేదికల నిర్మాణాలు నెలరోజుల్లో పూర్తిచేయాలనే లక్ష్యంతో ముం దుకు సాగుతున్నారు. కామారెడ్డి జిల్లాలోని బీర్కూర్‌ మండలం రైతు నగర్‌లో రైతువేదిక నిర్మాణం వందశాతం అన్ని హంగులతో సిద్ధమైంది. గత నెల ఆగస్టు 15న స్పీకర్‌ పోచారం శ్రీనివాస్‌రెడ్డి చేతుల మీదుగా జిల్లాలో 104 క్లస్టర్‌లలో రైతు వేదికల నిర్మాణాలను ప్రారంభించారు. వీటిలో ఇప్పటికే 70 వేదిక భవనాల నిర్మాణాలు పూర్తయ్యాయి. మిగతా నిర్మాణ పనులు చివరి దశకు చేరుకున్నట్లు అధికారులు చెబుతున్నారు. ఈ నెల 20నాటికి భవన నిర్మాణాలు పనులు పూర్తి చేయాలని కలెక్టర్‌ ఆయా మండల అధికారులను ఆదేశించారు. రైతువేదికల చుట్టూ అంద ంగా మొక్కల పెంపకం, పచ్చదనం రూపొందించడం రైతు వేదికలలో విద్యుత్‌, టాయిలెట్స్‌ వంటి వసతులు కల్పించనున్నారు.


వేదికల నిర్మాణాలు చివరి దశలో ఉన్నాయి : శరత్‌, కలెక్టర్‌.

జిల్లాలో 104 రైతు వేదికల్లో 70 భవ న నిర్మాణాలు పూర్తి కావచ్చాయి. మిగిలి నవి ఈ నెల 20లోపు పూర్తి చేస్తాం. 104 రైతు వేదికల భవనాల అన్నింటిని ఒకేరోజు ప్రారంభించేలా చర్యలు తీసుకుంటున్నాం. ప్రారంభోత్సవానికి సీఎం కేసీఆర్‌ను సమయం ఇవ్వాలని జిల్లా ప్రజాప్రతినిధులను కోరాం. జిల్లాలోని ప్రజాప్రతినిధులు కలిసి కట్టుగా ఒకే రోజు భూమి పూజలు చేశారు. అదే తరహాలో ఒకే రోజు వేదికల భవనాలను ప్రారంభించేలా చర్యలు తీసుకుంటున్నాం.

Updated Date - 2020-09-14T11:06:54+05:30 IST