AP News: రాష్ట్ర సమగ్రాభివృద్ధికి సీఎం కట్టుబడి ఉన్నారు : మంత్రి రోజా

ABN , First Publish Date - 2022-09-26T23:26:08+05:30 IST

Amaravathi: అమరావతే రాష్ట్ర రాజధాని (Capital) అని టీడీపీ మొదట్నుంచి వాదిస్తుంది. అయితే వైసీపీ(YCP) మాత్రం పాలనా వికేంద్రీకరణ పేరుతో మూడు రాజధానుల జపం చేస్తుంది. అమరావతినే రాష్ట్ర రాజధానిగా కొనసాగించాలని గత కొంతకాలంగా రైతులు పాదయాత్ర చేస్తున్న విషయం తెలిసిందే

AP News: రాష్ట్ర సమగ్రాభివృద్ధికి సీఎం కట్టుబడి ఉన్నారు : మంత్రి రోజా

Amaravathi: అమరావతే రాష్ట్ర రాజధాని (Capital) అని టీడీపీ మొదట్నుంచి వాదిస్తుంది. అయితే వైసీపీ(YCP) మాత్రం పాలనా వికేంద్రీకరణ పేరుతో మూడు రాజధానుల జపం చేస్తుంది. అమరావతినే రాష్ట్ర రాజధానిగా కొనసాగించాలని గత కొంతకాలంగా రైతులు పాదయాత్ర చేస్తున్న విషయం తెలిసిందే. వీరి పాదయాత్రపై మంత్రి రోజా స్పందించారు. రాష్ట్రంలో అలజడి సృష్టించేందుకే అమరావతి రైతుల పాదయాత్ర చేస్తున్నారని ఆరోపించారు. ‘రైతులు ఐ ఫోన్లో మాట్లాడుతూ.. తొడలు కొట్టడం ఎక్కడైనా చూశారా? ఆ పార్టీలో అంతే.. ఆడవాళ్లు తొడలు కొడతారు.. మగాళ్లు ఏడుస్తారు. 29 గ్రామాల కోసం 26 జిల్లాల అభివృద్ధిని అడ్డుకోవాలని సీఎం అనుకోరు. ఏపీలో ప్రతి నియోజకవర్గం రాజధానితో సమానంగా అభివృద్ధి చెందాలి. రాష్ట్ర సమగ్రాభివృద్ధికి సీఎం కట్టుబడి ఉన్నారు’’ అని రోజా పేర్కొన్నారు.  

Updated Date - 2022-09-26T23:26:08+05:30 IST