మీరాబాయి చానుకు సీఎం జగన్ అభినందనలు

Jul 24 2021 @ 17:55PM

అమరావతి: టోక్యో ఒలింపిక్స్-2020 వెయిట్ లిఫ్టింగ్ లో రజత పతకం సాధించిన ‘మీరాబాయి చాను’కు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అభినందనలు తెలిపారు. క్రీడోత్సవాలు ప్రారంభ దశలోనే వెయిట్ లిఫ్టింగ్‌లో భారత్ రజత పతకం సాధించడం సంతోషించదగ్గ విషయమన్నారు. మహిళల విభాగంలో భారత్ పతకం సాధించి టోక్యో ఒలింపిక్స్‌లో శుభారంభం చేసి భారత కీర్తిని ఇనుమడింపజేశారని కొనియాడారు. దేశ ప్రజల ఆకాంక్షను నెరవేర్చిన మీరాబాయికి ఆంధ్రప్రదేశ్ తరపున, రాష్ట్ర ప్రజల తరపున అభినందనలు తెలిపారు. ఆమె విజయం ఎందరికో స్ఫూర్తిని, మరెందరికో ఆదర్శమన్నారు.  

Follow Us on:
అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.