AP News: జగన్ పులివెందుల పులి కాదు.. పిల్లి: అయ్యన్నపాత్రుడు

ABN , First Publish Date - 2022-08-28T23:53:46+05:30 IST

సీఎం జగన్ (CM Jagan) పులివెందుల పులి కాదని పిల్లి అని టీడీపీ నేత అయ్యన్నపాత్రుడు (Ayyanna Patrudu) ఎద్దేవాచేశారు.

AP News: జగన్ పులివెందుల పులి కాదు.. పిల్లి: అయ్యన్నపాత్రుడు

విశాఖ: సీఎం జగన్ (CM Jagan) పులివెందుల పులి కాదని పిల్లి అని టీడీపీ నేత అయ్యన్నపాత్రుడు (Ayyanna Patrudu) ఎద్దేవాచేశారు. 600 మంది పోలీసులు ఉంటేగానీ జగన్ బయటకు రాలేరని విమర్శించారు. మనం ప్రజాస్వామ్యంలో ఉన్నామా? లేక అరాచకత్వంలోనా? అని ప్రశ్నించారు. జగన్ ప్రయాణంలో రోడ్డుకు ఇరువైపులా పరదాలెందుకని నిలదీశారు. టీడీపీ (TDP) కార్యకర్తలు రోడ్డెక్కితే జగన్ తోక ముడవాల్సిందేనని హెచ్చరించారు. టీడీపీ కార్యకర్తలను పోలీసులు, సీఐడీ శాఖ కంట్రోల్ చేయగలరా? అని అయ్యన్నపాత్రుడు ప్రశ్నించారు.

Updated Date - 2022-08-28T23:53:46+05:30 IST