CM Jagan: మా ప్రధాన లక్ష్యం సుస్ధిరాభివృద్ది..

ABN , First Publish Date - 2022-08-26T20:46:01+05:30 IST

విశాఖలో ఇప్పటివరకు 76 టన్నుల ప్లాస్టిక్‌ను సేకరించామని సీఎం జగన్ తెలిపారు.

CM Jagan: మా ప్రధాన లక్ష్యం సుస్ధిరాభివృద్ది..

విశాఖ (Visakha): విశాఖలో ఇప్పటివరకు 76 టన్నుల ప్లాస్టిక్‌ను సేకరించామని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి (CM Jagan) తెలిపారు. పార్లే ఫర్‌ ది ఓషన్‌ (Parlay for the Ocean) సంస్థ రాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకుంది. ఏయూ (AU) కన్వెన్షన్‌ హాలులో జరిగిన ఈ కార్యక్రమలో పాల్గొన్న సీఎం మాట్లాడుతూ తమ ప్రధాన లక్ష్యం సుస్ధిరాభివృద్ది అని, పర్యావరణాన్ని, ప్రకృతిని కాపాడుకోవాలని, క్లాప్ పధకం కింద 4,097 చెత్త సేకరణ వాహనాలు ఇచ్చామని చెప్పారు. మెరైన్ ప్లాంట్ల వల్లే 70 శాతం ఆక్సిజన్ లభిస్తోందన్నారు. ప్లాస్టిక్ డెబ్రస్ వల్ల సముద్ర జల చరాలు మనుగడ ప్రశ్నార్థకంగా మారుతోందన్నారు. ఏపీ 975 కిమీ కోస్తా తీరాన్ని కలిగివుందన్నారు. ప్లాస్టిక్ ఫ్రీ ఓషన్ సాధనే లక్ష్యమని, అందుకు రెండు ప్రముఖ సంస్ధలతో ఒప్పందం కుదుర్చుకున్నామని తెలిపారు.


గ్లోబల్ ఎలైన్స్ ఫర్ సస్టైనబుల్ ప్లానెట్ సంస్ధ గ్రీన్ ట్రాన్సాఫార్మేషన్ కోసం పని చేస్తుందని.. ఐడియాస్ తీసుకువస్తారని సీఎం జగన్ అన్నారు. పార్లే సంస్ధ ప్లాస్టిక్ ఏరివేతతో పాటు రీసైకిలింగ్ కోసం పని చేస్తుందని, ఉత్పత్తులను తయారు చేసి ఎయర్ స్టేషన్లను ఏర్పాటు చేసుకోవాలన్నారు. ఎవాయడ్ ఇంటర్ సెప్ట్ రీ డిజైన్ స్టేషన్ తీసుకువస్తామన్నారు. పార్లే సంస్ధ 10 ఎకో ఇన్నోవేషన్ హబ్‌లు ఏర్పాటు చేస్తుందని, 20 వేల ఓషన్ వేరియర్స్‌ను తయారు చేస్తామన్నారు. ఒక్కో వారియర్‌కు నెల వారీ రూ. 16 వేల ఆదాయం లభిస్తుందన్నారు. పార్లే సూపర్ హబ్‌లో రీ సైక్లింగ్, అప్ సైక్లింగ్ ప్రక్రియలు జరుగుతాయని చెప్పారు. పార్లే సూపర్ ఇనిస్టిట్యూట్ విశాఖలో రాబోతోందని ముఖ్యమంత్రి వెల్లడించారు. కట్టింగ్ ఎడ్జ్ టెక్నాలజీతో పనిచేయడం గొప్ప విషయమన్నారు. 2027 కల్లా ప్లాస్టిక్ పొల్యూషన్ ఫ్రీ రాష్ట్రంగా తయారు చేస్తామన్నారు. పార్లే ఫర్ ది ఓషన్ సంస్ధ నుంచి రూ. 16వేల కోట్ల పెట్టుబడులు విశాఖకు వస్తాయన్నారు. ఇవాల్టి నుంచి ఏపిలో ప్లాస్టిక్ ఫెక్సీలు బ్యాన్ చేస్తున్నామన్నారు. తిరుమలో ఇప్పటికే ప్లాస్టిక్ ఫ్రీ జోన్ అమలవుతోందని సీఎం జగన్ పేర్కొన్నారు.

Updated Date - 2022-08-26T20:46:01+05:30 IST