జంగారెడ్డిగూడెంలో సారా కాయడం Impossible: సీఎం జగన్

ABN , First Publish Date - 2022-03-15T19:43:15+05:30 IST

ఏపీ అసెంబ్లీలో జంగారెడ్డిగూడెంలో నాటుసారా మృతుల సంఘటనపై రగడ నెలకొంది.

జంగారెడ్డిగూడెంలో సారా కాయడం Impossible: సీఎం జగన్

అమరావతి: ఏపీ అసెంబ్లీలో జంగారెడ్డిగూడెంలో నాటుసారా మృతుల సంఘటనపై రగడ నెలకొంది. దీనిపై చర్చకు టీడీపీ ఎమ్మెల్యేలు పట్టుపట్టారు. ఈ నేపథ్యంలో సీఎం జగన్మోహన్ రెడ్డి టీడీపీ సభ్యులపై మండిపడ్డారు. సభ్యులు సభలో హుందాగా ప్రవర్తించాలని సూచించారు. 55 వేల జనాభా ఉన్న జంగారెడ్డిగూడెం మున్సిపాలిటీలో.. సారా తయారీ చేయడం సాధ్యమవుతుందా? అని ప్రశ్నించారు. వార్డు సచివాలయం, కార్పొరేటర్లు, పోలీస్ స్టేషన్ ఉందని.. ఇలాంటి మున్సిపాలిటీలో నాటు సారా కాయడం సాధ్యమేనా? అని మరోసారి సీఎం జగన్ ప్రశ్నించారు. ఏదో మారుమూల గ్రామంలో సారా కాస్తున్నారంటే ఆలోచించాల్సిన విషయమన్నారు. సారా కేసేవాళ్లకు ప్రభుత్వం అండగా ఉండాల్సిన అవసరం తమకు లేదన్నారు. సారా కాసేవాళ్లపై ఉక్కుపాదం మోపడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని సీఎం జగన్ స్పష్టం చేశారు. 

Updated Date - 2022-03-15T19:43:15+05:30 IST