Jagan meeting with Modi: ప్రధాని మోదీతో సీఎం జగన్ సమావేశం

ABN , First Publish Date - 2022-08-22T16:22:29+05:30 IST

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీతో ఏపీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి సోమవారం ఉదయం భేటీ అయ్యారు.

Jagan meeting with Modi: ప్రధాని మోదీతో సీఎం జగన్ సమావేశం

న్యూఢిల్లీ/అమరావతి: ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (Narendra modi)తో ఏపీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి (Jagan mohan reddy) సోమవారం ఉదయం భేటీ అయ్యారు. రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలపై చర్చించనున్నట్లు తెలుస్తోంది. జగన్‌ (CM Jagan)తో పాటు ప్రధాని నివాసానికి ఎంపీలు విజయ్‌సాయిరెడ్డి (Vijayasai reddy), మిథున్ రెడ్డి (Mithun reddy) చేరుకున్నారు. ప్రధాని మోదీతో భేటీ అనంతరం రాష్ట్రపతి ద్రౌపది ముర్ము (Draupadi Murmu), ఉపరాష్ట్రపతి జగ్ దీప్ దన్ ఖద్‌ (Jag Deep Dan Khad)ను జగన్ కలవనున్నారు. అలాగే కేంద్ర విద్యుత్ శాఖ మంత్రి ఆర్‌కే సింగ్‌ (RK Singh)ను కూడా సీఎం జగన్ (jagan) కలిసే అవకాశం ఉంది. 

Updated Date - 2022-08-22T16:22:29+05:30 IST