అమిత్‌షాతో ముగిసిన సీఎం జగన్ సమావేశం

ABN , First Publish Date - 2020-09-23T16:34:43+05:30 IST

కేంద్ర మంత్రి అమిత్‌షా ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి సమావేశం ముగిసింది.

అమిత్‌షాతో ముగిసిన సీఎం జగన్ సమావేశం

న్యూఢిల్లీ: కేంద్ర మంత్రి అమిత్‌షాతో ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి సమావేశం ముగిసింది. దాదాపు 40 నిమిషాల పాటు ఈ సమావేశం సాగింది. సమావేశంలో ఎంపీ విజయసాయిరెడ్డి, మిథున్ రెడ్డి పాల్గొన్నారు. 


అంతకుముందు బుధవారం ఉదయం సీఎం జగన్ కేంద్ర జలశక్తి మంత్రి షెకావత్‌తో భేటీ అయ్యారు. ఈ సమావేశంలో ప్రధానంగా పోలవరం ప్రాజెక్టపై చర్చలు జరిపినట్లు తెలియవచ్చింది. పోలవరంకు సంబంధించి ఇప్పటి వరకు కేంద్రం నుంచి రావాల్సిన నిధులు చాలా ఉన్నాయని, ఇటీవల పెంచిన అంచనాలకు కూడా సీడబ్ల్యూసీ ఆమెదం తెలిపిందని, అలాగే రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటి వరకు ఖర్చు చేసిన రూ. 4వేల కోట్లు, రావల్సిన బకాయిలు రూ. 8,400 కోట్లు విడుదల చేయాలని షెకావత్‌ను కోరినట్లు సమాచారం. అలాగే రాయలసీమ ఎత్తిపోతల పథకానికి సంబంధించి, ఏపీ విభజన చట్టంలోని అంశాలను చర్చించారు.


అమిత్ షాతో నిన్న సాయంత్రం 40 నిముషాలపాటు భేటీ అయిన సీఎం జగన్ కోర్టులు, న్యాయమూర్తులపై జరుగుతున్న దాడులపై, అనేక అంశాలపై చర్చలు జరిపిన విషయం తెలిసిందే. 

Updated Date - 2020-09-23T16:34:43+05:30 IST