Jagan mohan reddy: రాష్ట్రపతి ద్రౌపది ముర్ముతో సీఎం జగన్ భేటీ

ABN , First Publish Date - 2022-08-22T18:50:03+05:30 IST

రాష్ట్రపతి ద్రౌపది ముర్ముతో ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సోమవారం భేటీ అయ్యారు.

Jagan mohan reddy: రాష్ట్రపతి ద్రౌపది ముర్ముతో సీఎం జగన్ భేటీ

న్యూఢిల్లీ/అమరావతి: రాష్ట్రపతి ద్రౌపది ముర్ము (Draupadi Murmu)తో ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి (Jagan mohan reddy) సోమవారం భేటీ అయ్యారు. రాష్ట్రపతి (President)తో జగన్ (AP CM) మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. ఇటీవల రాష్ట్రపతి ఎన్నికల్లో ద్రౌపది ముర్ముకు వైసీపీ (YCP) మద్దతు తెలిపిన విషయం తెలిసిందే. రాష్ట్రపతితో భేటీ అనంతరం ఉపరాష్ట్రపతి జగ్ దీప్ దన్ ఖద్‌ (Jag Deep Dan Khad)ను ఏపీ సీఎం కలవనున్నారు. అలాగే కేంద్ర విద్యుత్ శాఖ మంత్రి ఆర్‌కె సింగ్‌ (RK Singh)ను కూడా సీఎం జగన్ (CM Jagan) కలిసే అవకాశం ఉంది. 


అంతకుముందు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (PM Narendra modi)తో జగన్ సమావేశమయ్యారు. దాదాపు 30 నిమిషాల పాటు సమావేశం జరిగింది. జగన్ వెంట విజయసాయి రెడ్డి (Vijayasai reddy) ఉన్నారు. పలు కేసులు చుట్టుముడుతున్న వేళ.. సీఎం జగన్మోహన్ రెడ్డి ఢిల్లీ పర్యటన ప్రాధాన్యం సంతరించుకుంది. గతంలో ఉన్న కేసులకు తోడు వివేకా హత్య కేసు (Viveka murder case), ఢిల్లీ లిక్కర్ స్కామ్‌ (Liquor scam)పై సీబీఐ దర్యాప్తు చేస్తోంది. వివేకా హత్య కేసులో త్వరలోనే కీలక పరిణామాలు జరుగుతాయంటూ ఇప్పటికే చర్చ జరుగుతోంది.

Updated Date - 2022-08-22T18:50:03+05:30 IST