Cm Jagan కంటే ముందే మంత్రి పర్యటన.. ఎందుకో తెలుసా?

ABN , First Publish Date - 2022-07-25T23:25:37+05:30 IST

కోనసీమ (Konaseema): జిల్లా పి. గన్నవరం మండలం జి. పెద్దపూడి పరిసర లంక గ్రామాల్లో ఈ నెల 26న సీఎం జగన్ (Cm jagan) పర్యటించనున్నారు. ముందస్తుగా..

Cm Jagan కంటే ముందే మంత్రి పర్యటన.. ఎందుకో తెలుసా?

కోనసీమ (Konaseema): జిల్లా పి. గన్నవరం మండలం జి. పెద్దపూడి పరిసర లంక గ్రామాల్లో ఈ నెల 26న సీఎం జగన్ (Cm jagan) పర్యటించనున్నారు. ముందస్తుగా మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ (Minister Chelluboina Venugopala Krishna)తో పాటు ప్రజా ప్రతినిధుల బృందం లంక గ్రామాల్లో పర్యటించింది. ఇంటింటికి వెళ్లారు. సీఎం వస్తున్నందున ఆయన ముందు ఏ విధంగా మాట్లాడాలనే అంశంపై మంత్రి వరద బాధితులకు శిక్షణ (Training) ఇచ్చారు. 



‘‘26న సీఎం జగన్ మీ ముందుకు వస్తున్నారు. మీరు పడ్డ కష్టాలను మీ నోటి నుంచే స్వయంగా వినాలని మీరు పొందిన భరోసా, ధైర్యాన్ని మీ నుంచి తెలుసుకోవడానికి వస్తున్నారు.’’ అని మంత్రి తెలిపారు. మహిళలకు శిక్షణ ఇచ్చాక  సీఎం ముందు ఎలా మాట్లాడాలో వారితో చెప్పించారు. మధ్యలో ఓ మహిళ మాట్లాడేందుకు ప్రయత్నించడంతో మంత్రి జోక్యం చేసుకుని నువ్వు ఆగమ్మా అంటూ శిక్షణ ఇచ్చిన మహిళ చేత మళ్లీ చెప్పించుకున్నారు. ఇదే తరహాలో సీఎం జగన్ ముందు డ్వాక్రా మహిళలు(dwakra women), వాలంటీర్లు (Volunteer), సచివాలయ ఉద్యోగులు (Sachivala Employees) ఎలా మాట్లాడాలో.. ఆ నాలుగు లంక గ్రామాల్లో శిక్షణ ఇస్తున్నారు. 

Updated Date - 2022-07-25T23:25:37+05:30 IST