CM Jagan on Assembly: ఎన్టీఆర్‌పై నాకు మమకారం ఉంది

ABN , First Publish Date - 2022-09-21T18:43:28+05:30 IST

‘‘స్వర్గీయ నందమూరి తారకరామారావుకు వ్యతిరేకంగా నేను ఎప్పుడూ మాట్లాడలేదు... ఆయన మీద నాకు మమకారం ఉంది’’ అని ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి అన్నారు.

CM Jagan on Assembly: ఎన్టీఆర్‌పై నాకు మమకారం ఉంది

అమరావతి: ‘‘స్వర్గీయ నందమూరి తారకరామారావు (NTR)కు వ్యతిరేకంగా నేను ఎప్పుడూ మాట్లాడలేదు... ఆయన మీద నాకు మమకారం ఉంది’’ అని ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి (Jagan mohan reddy) అన్నారు. బుధవారం ఎన్టీఆర్‌ హెల్త్ యూనివర్సిటీ (NTR Health university) పేరు మార్పు బిల్లును మంత్రి రజనీ (Rajani) ప్రవేశపెట్టగా సభ ఆమోదం తెలిపింది. ఈ సందర్భంగా సీఎం జగన్ (AP CM) సభలో ప్రసంగిస్తూ... గతంలో తెలుగుదేశం పార్టీ హెల్త్ యూనివర్సిటీకి ఎన్టీఆర్ (Nandamuri taraka ramarao) పేరు పెడితే దాన్ని మార్చి వైఎస్ఆర్ పేరు మార్చుతున్నామని తెలిపారు. ‘‘ఈ సమయంలో టీడీపీ సభ్యులు ఉంటే బావుండేది.. ఎందుకు పేరు మార్చుతున్నాం... దానికి కారణం ఏంటి అది సహేతుకమా కాదా అనేది చర్చించాల్సింది’’ అని అన్నారు.


నందమూరి తారకరామారావు అనే పేరు పలికితే చంద్రబాబు (Chandrababu)కు నచ్చదని.... చంద్రబాబు (TDP Chief) పలికితే ఎన్టీఆర్‌కు నచ్చదని తెలిపారు. ఎన్టీఆర్ గొప్పనటుడని, గొప్పఖ్యాతి సంపాదించారని కొనియాడారు. చంద్రబాబు (Nara Chandrababu naidu) అధికారం లాక్కోకుండా ఉంటే ఇంకా ఎక్కువ కాలం బ్రతికేవారని అన్నారు. 1995లో సొంత కూతురిని ఇచ్చిన అల్లుడు అధికారం లాక్కోవడంతో మానసిక క్షోభ వల్ల ఎన్టీఆర్ అకాల మరణం చెందారన్నారు. ఎన్టీఆర్ జిల్లా పేరు పెట్టి మాట నిలబెట్టుకున్నామని ఏపీ సీఎం చెప్పుకొచ్చారు. 


పేరు మార్పుపై అనేక సార్లు ప్రశ్నించుకున్నా...

ఎన్టీఆర్‌కు భారతరత్న(Bharataratna) ఎందుకు ఇప్పించలేకపోయారో చంద్రబాబు చెప్పాలని డిమాండ్ చేశారు. రాజకీయాల్లో సిన్సియారిటీ, చిత్త శుద్ది కరువైందన్నారు. హెల్త్ యూనివర్సిటీ పేరు మార్పు బిల్లు తెచ్చే ముందు అనేక సార్లు ప్రశ్నించుకున్నానని... చివరకు తాను చేస్తుంది కరెక్టే అని భావించాకే ఈ పేరుపెట్టాలని నిర్ణయించామని చెప్పుకొచ్చారు. 108, ఆరోగ్యశ్రీ అంటే గుర్తుకు వచ్చేది వైఎస్ఆర్ (YSR) అని... ఆయన వృత్తిపరంగా కూడా డాక్టర్ అని తెలిపారు. 


అందుకే ఆ క్రెడిట్ మాకే దక్కాలి....

ఖరీదైన కార్పోరేట్ వైద్యాన్ని పేదలకు అందుబాటులోకి తెచ్చిన మానవతావాద మహా శిఖరం డాక్టర్ వైఎస్ఆర్ అని కొనియాడారు. రాష్ట్రంలో 8 మెడికల్ కాలేజీలు 1983 కన్నాముందే వచ్చాయని...మిగిలిన మూడు మెడికల్ కాలేజీలు వైఎస్ఆర్ హయాంలో వచ్చాయని తెలిపారు. తన హయాంలో మరో 17 మెడికల్ కాలేజీలు కడుతున్నామని చెప్పారు. టీడీపీ (TDP) హయాంలో కనీసం ఒక్క మెడికల్ కాలేజీని ప్రభుత్వ రంగంలో కట్టలేదని... అయినా వారికి ఇష్టమైన పేరు వారు పెట్టుకున్నారని తెలిపారు. తాము 20 కాలేజీలు కట్టాము కాబట్టి ఆ క్రెడిట్ తమకే దక్కాలన్నారు. ఆరోగ్య శ్రీలో ప్రోసీజర్లు పెంచుతున్నామని... ఆరోగ్య ఆసరా అమలు చేస్తున్నామని తెలిపారు. ఆసుపత్రులను భాగుచేస్తున్నామని, 108 అంబులెన్సులు ఇంకా వస్తున్నాయని జగన్ సభలో వెల్లడించారు. 

Updated Date - 2022-09-21T18:43:28+05:30 IST