
ఏలూరు: నేడు ఏలూరు జిల్లాలో సీఎం జగన్ మోహన్ రెడ్డి పర్యటించనున్నారు. గణపవరంలోని చింతలపాటి మూర్తి రాజు డిగ్రీ కాలేజీలో రైతు భరోసా కార్యక్రమంలో జగన్ ఉదయం 10.10 గంటలకు హాజరుకానున్నారు. అనంతరం సీఎం తిరిగి మధ్యాహ్నం 12.15 గంటలకు తాడేపల్లి బయల్దేరుతారు. సీఎం పర్యటన సందర్భంగా పోలీసులు ముందస్తుగా భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. జగన్ పర్యటన దృష్ట్యా ఏలూరు, పశ్చిమగోదావరి జిల్లాల నుంచి భారీగా పోలీసు బలగాలను తరలించారు.