విద్యాశాఖపై సీఎం జగన్‌ సమీక్ష

ABN , First Publish Date - 2021-10-11T21:34:18+05:30 IST

సీఎం జగన్ సోమవారం విద్యా శాఖపై సమీక్ష నిర్వహించారు.

విద్యాశాఖపై సీఎం జగన్‌ సమీక్ష

అమరావతి: ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సోమవారం విద్యాశాఖపై సంబంధిత మంత్రి, ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్బంగా మాట్లాడుతూ ఎయిడెడ్‌ స్కూళ్ల విషయంలో ఎలాంటి బలవంతం లేదన్నారు. ఎయిడెడ్‌ స్కూళ్లను యాజమాన్యం అప్పగిస్తేనే ప్రభుత్వం నడిపిస్తుందని లేదా యాజమాన్యం నడపాలనుకుంటే నడుపుకోవచ్చునని, ఇందులో ఎలాంటి బలవంతం లేదని స్పష్టం చేశారు.


2022 నుంచి ‘అమ్మఒడి’ పథకానికి హాజరు శాతం అనుసంధానం చేయాలని ముఖ్యమంత్రి సూచించారు. 'అమ్మఒడి' పథకానికి 75 శాతం హాజరు తప్పనిసరి అని చెప్పారు. ప్రతి హైస్కూల్‌కు కచ్చితంగా ప్లే గ్రౌండ్‌ ఉండాలన్నారు. ప్రతి స్కూల్‌కు నిర్వహణ ఖర్చుల కింద రూ.లక్ష అందుబాటులో ఉంచాలని, టీచర్ల మ్యాపింగ్‌ను వెంటనే పూర్తిచేయాలని సీఎం జగన్ ఆదేశించారు.

Updated Date - 2021-10-11T21:34:18+05:30 IST