వైఎస్సార్ జగనన్న శాశ్వత భూహక్కు-భూరక్ష పథకాన్ని ప్రారంభించిన సీఎం

ABN , First Publish Date - 2022-01-18T19:54:44+05:30 IST

వైఎస్‌ఆర్‌ జగనన్న శాశ్వత భూహక్కు- భూరక్ష పథకాన్ని సీఎం జగన్ ప్రారంభించారు.

వైఎస్సార్ జగనన్న శాశ్వత భూహక్కు-భూరక్ష పథకాన్ని ప్రారంభించిన సీఎం

అమరావతి: వైఎస్‌ఆర్‌ జగనన్న శాశ్వత భూహక్కు- భూరక్ష పథకాన్ని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మంగళవారం ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఇక భూములమీద లిటిగేషన్ లేని పరిస్థితి వస్తుందని, ఆ ప్రక్రియ చేయడం కోసమే ఈ కార్యక్రమం జరుగుతోందన్నారు. శాస్త్రీయ, సాంకేతిక పరిజ్ఞానంతో సమగ్ర భూసర్వే చేపట్టామని, తొలిదశలో 50 గ్రామాల్లో పూర్తి చేశామన్నారు. మంగళవారం నుంచి 37 గ్రామ సచివాలయాల్లోనే స్థిరాస్తుల రిజిస్ట్రేషన్లు చేయిస్తామన్నారు. రాబోయే 3 వారాల్లో మిగతా గ్రామాల్లో రిజిస్ట్రేషన్లు పూర్తి చేస్తామన్నారు.


వివాదాలకు తావు లేకుండా భూసర్వేలు చేసి స్థిరాస్తుల రిజిస్ట్రేషన్లు చేస్తామని సీఎం జగన్ స్పష్టం చేశారు. వందేళ్ల తర్వాత సమగ్ర భూసర్వే చేస్తున్నామన్నారు. నిర్దిష్టమైన హద్దులు, శాశ్వత హక్కులు లేకపోవడంతో రికార్డులు తారుమారు అయ్యాయని, సరైన వ్యవస్థ లేకపోవడంతో ఆస్తుల ట్యాంపరింగ్ అవుతోందన్నారు. సివిల్ వివాదాలకు ఫుల్‌స్టాప్ పెట్టేందుకే ఒకేసారి భూములన్నీ సర్వే చేయిస్తున్నామని, డిజిటల్‌గా రికార్డ్‌ చేసి క్యూఆర్‌కోడ్‌తో ల్యాండ్ మ్యాపింగ్ చేస్తామన్నారు. నకిలీ రిజిస్ట్రేషన్లకు, లంచాలకు తావులేకుండా సమగ్ర భూసర్వే జరుగుతుందని, 2023లోగా సమగ్ర ఆధునిక సర్వే చేయాలనే లక్ష్యంతో ముందుకు వెళుతున్నామని, ఇదో విప్లవాత్మక మార్పని.. క్లియర్ టైటిల్స్ అందించడమే ఈ పథకం ముఖ్య ఉద్దేశమని ముఖ్యమంత్రి జగన్‌ స్పష్టం చేశారు.

Updated Date - 2022-01-18T19:54:44+05:30 IST