ధాన్యం సేకరణలో మిల్లర్ల ప్రమేయం ఉండరాదు : సీఎం జగన్

ABN , First Publish Date - 2021-05-07T21:49:08+05:30 IST

రాష్ట్రంలో వ్యవసాయ సలహా కమిటీలను క్రియాశీలం చేయాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అధికారులను

ధాన్యం సేకరణలో మిల్లర్ల ప్రమేయం ఉండరాదు : సీఎం జగన్

అమరావతి : రాష్ట్రంలో వ్యవసాయ సలహా కమిటీలను క్రియాశీలం చేయాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అధికారులను ఆదేశించారు. వారికి అన్ని అంశాలపై పూర్తి అవగాహన కల్పించాలని కోరారు. రేషన్ బియ్యం డోర్‌డెలివరీపై క్యాంప్ కార్యాలయంలో సీఎం జగన్ సమీక్షా సమావేశం నిర్వహించారు. క్రాప్ ప్లానింగ్ మొదలుకొని, అన్ని అంశాల్లో వీరు రైతులకు పూర్తిగా అండగా ఉండాలన్నారు. ఈ మహత్తర ప్రక్రియలో మహిళలను కూడా భాగస్వాములు చేయాలని సూచించారు.


అంతేకాకుండా వ్యవసాయ సలహా కమిటీల బాధ్యతలు, పనితీరుపై ఉన్నతాధికారులు నిరంతరం సమీక్షలు చేస్తూ ఉండాలని, ఇదంతా రాష్ట్ర స్థాయిలో పౌర సరఫరాల మంత్రి పర్యవేక్షణ చేస్తారని పేర్కొన్నారు. అయితే ధాన్యం సేకరణలో మిల్లర్ల ప్రమేయం ఎక్కడా ఉండకూడదని జగన్ స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. ధాన్యం ఏ మిల్లుకు పంపాలన్నది అధికారులే నిర్ణయించాలని, రైతుకు ఎక్కడా నష్టం రాకూడదని స్పష్టం చేశారు. రైతు భరోసా కేంద్రాల ద్వారా పక్కాగా ధాన్యం సేకరణ జరగాలని, రేషన్ బియ్యం డోర్ డెలివరీలో ఏక్కడా లోపం రాకూడదని సీఎం జగన్ స్పష్టం చేశారు. 

Updated Date - 2021-05-07T21:49:08+05:30 IST