
ఏలూరు/తణుకు : సంపూర్ణ గృహహక్కు పథకం ప్రారంభించేందుకు సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నేడు తణుకులో పర్యటించునున్నారు. ఉదయం 10.15 గంటలకు ఇంటి నుంచి బయలుదేరి 10.20కు తాడేపల్లిలోని హెలీపాడ్ చేరతారు. 10.30 గంటలకు హెలీ కాప్టర్లో తణుకు చేరుకుంటారు. 11 గంటలకు హెలీపాడ్ నుంచి రోడ్డు మార్గం ద్వారా ప్రజలకు అభివాదం చేస్తూ.. 11.10కు బాలురోన్నత పాఠశాలలోని సభావేదిక వద్దకు చేరి వివిధ స్టాల్స్‌ను పరిశీలిస్తారు. ఆ తర్వాత 11.20కు సంపూర్ణ గృహ హక్కు పథకాన్ని ప్రారంభిస్తారు. అనంతరం బహిరంగ సభలో జగన్ మాట్లాడతారు. 12.50 గంటలకు సభ పూర్తయిన తర్వాత ఒంటి గంటకు తిరిగి హెలీకాప్టర్‌లో సీఎం బయలుదేరి తాడేపల్లి వెళతారు.