సీఎం జగన్‌ మాట తప్పారు..

ABN , First Publish Date - 2022-06-25T06:33:39+05:30 IST

ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు వైఎస్‌ జగన్‌ ముస్లిం మైనార్టీల కోసం దుల్హన్‌ పథకాన్ని రూ.50వేల నుంచి రూ.లక్షకు పెంచుతామని హామీ ఇచ్చి మాట తప్పారని మాజీ ఎమ్మెల్యే, పాణ్యం టీడీపీ ఇన్‌చార్జి గౌరు చరిత ఆరోపించారు.

సీఎం జగన్‌ మాట తప్పారు..
సమావేశంలో మాట్లాడుతున్న గౌరు చరిత

ముస్లింలను దగా చేసిన ప్రభుత్వం
దుల్హన్‌ పథకాన్ని కొనసాగించాలి
మాజీ ఎమ్మెల్యే గౌరు చరిత


కల్లూరు, జూన్‌ 24:
ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు వైఎస్‌ జగన్‌ ముస్లిం మైనార్టీల కోసం దుల్హన్‌ పథకాన్ని రూ.50వేల నుంచి రూ.లక్షకు పెంచుతామని హామీ ఇచ్చి మాట తప్పారని మాజీ ఎమ్మెల్యే, పాణ్యం టీడీపీ ఇన్‌చార్జి గౌరు చరిత ఆరోపించారు. శుక్రవారం స్థానిక మాదవీనగర్‌లోని ఆమె స్వగృహంలో ముస్లిం మైనార్టీ నాయకులతో కలిసి ఆమె విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు. ఈసందర్భంగా గౌరు చరిత మాట్లాడుతూ ముస్లింలను వైసీపీ ప్రభుత్వం దగా చేసిందని అన్నారు. దుల్హన్‌ పథకాన్ని కొనసాగించాలని డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో నంద్యాల పార్లమెంటు మహిళా అధ్యక్షురాలు కె.పార్వతమ్మ, పాణ్యం మైనార్టీ సెల్‌ అధ్యక్షుడు ఎస్‌.ఫిరోజ్‌, మౌలాలి, అబ్దుల్‌ నాసీద్‌, మాలిక్‌, దొడ్డిపాడు బాషా, ఇబ్రహీం, ముర్తుజావలి, ఖాజా, మున్నా, జమిద్‌ పాల్గొన్నారు.

హుశేనాపురంలో సీఎం దిష్టిబొమ్మ దహనం

ఓర్వకల్లు: ముస్లింలను ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి దగా చేశారని జడ్పీ మాజీ చైర్మన్‌ మల్లెల రాజశేఖర్‌ ఆరోపించారు. శుక్రవారం మం డలంలోని హుశేనాపురం గ్రామంలో రాజశేఖర్‌ ఆధ్వర్యంలో ముస్లిం మైనార్టీ నాయకులు షాదీఖానా వద్ద సీఎం జగన్‌ దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ సందర్భంగా మల్లెల రాజశేఖర్‌ మాట్లాడుతూ జగన్‌మోహన్‌రెడ్డి పాదయాత్ర సమయంలో దుల్హన్‌ పథకానికి లక్ష ఇస్తానని చెప్పి ఓట్లు దండుకున్నాక మాట తప్పారని విమర్శించారు. కార్యక్రమంలో గ్రామ మైనార్టీ నాయకులు మహబూబ్‌ బాషా, నాయకులు రాము, మధు, నాగరాజు, సుధాకర్‌, రామగోవిందు, ముస్లిం మైనార్టీ మహిళలు పాల్గొన్నారు.

దుల్హన్‌ రూ.లక్ష హామీ హుళక్కి: ఆకెపోగు

గూడూరు: ముస్లింలను వైసీపీ ప్రభుత్వం మోసం చేసిందని, దుల్హన్‌ రూ.లక్ష హామీ హుళక్కి చేసిందని కోడుమూరు నియోజక వర్గం టీడీపీ ఇన్‌చార్జ్‌ ఆకెపోగు ప్రభాకర్‌ అన్నారు. శుక్రవారం గూడూరు పట్టణంలో పట్టణంలో టీడీపీ పట్టణ టీడీపీ అధ్యక్షుడు గజేంద్ర గోపాల్‌ నాయుడు ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆకెపోగు ప్రభాకర్‌ మాట్లాడుతూ పేద ముస్లిం అమ్మాయిలకు దుల్హన్‌ డబ్బుల్లేవని నిలిపివేయడం దారుణమన్నారు. ఈసమావేశంలో కర్నూలు పార్లమెంట్‌ అధికార ప్రతినిధి దండు సుందరరాజు, సీనీయర్‌ టీడీపీ నాయకులు విజయరాఘవ రెడ్డి, నాగరత్నారావు, మైనార్టీ సెల్‌ కార్యదర్శి మన్నన్‌బాషా, సులేమాన్‌ పాల్గొన్నారు.

దుల్హన్‌ పథకాన్ని పునరుద్ధరించాలి: టీడీపీ

కర్నూలు(అగ్రికల్చర్‌):  పేద ముస్లిం అమ్మాయిల వివాహం కోసం ఇచ్చే దుల్హన్‌ పథకాన్ని వెంటనే పునరుద్ధరించాలని టీడీపీ ముస్లిం మైనార్టీ నాయ కులు ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. శుక్రవారం నగరంలో టీడీపీ ముస్లిం మైనార్టీ కార్యదర్శి నూర్‌ మన్సూర్‌ అలీఖాన్‌, తెలుగు యువత అధ్యక్షుడు అబ్బాస్‌, తెలుగు మహిళ కర్నూలు పార్లమెంటు నియోజకవర్గ అధ్యక్షురాలు ముంతాజ్‌బేగం, తెలుగు యువత ఉపాధ్యక్షుడు సోమిశెట్టి నవీన్‌ తదితరులు పార్టీ కార్యాలయం వద్ద నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. కార్యక్రమంలో బోయ సంజీవలక్ష్మి, హనుమంతరావు చౌదరి, జహంగీర్‌, అమీద్‌, వేణు పాల్గొన్నారు.

కర్నూలు(కలెక్టరేట్‌): దుల్హన్‌ పథకాన్ని కొనసాగించాలంటూ ఎస్‌డీపీఐ నగర కమిటీ ఆధ్వర్యంలో స్థానిక కలెక్టరేట్‌ ముందు శుక్రవారం నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఎస్‌డీపీఐ జిల్లా అధ్యక్షుడు జహంగీర్‌ అహ్మద్‌ మాట్లాడుతూ పేద ముస్లిం అమ్మాయిలకు ఎంతో భరోసా, ఆసరాగా ఉన్న దుల్హన్‌ పథకాన్ని అమలు చేయలేని అంటూ వైసీపీ ప్రభుత్వం ముస్లింలను మోసం చేసిందని మండిపడ్డారు. కార్యక్రమంలో పీఎ్‌ఫఐ నగర కార్యదర్శి అహ్మద్‌ ఖాన్‌, ఎస్‌డీపీఐ నగర అధ్యక్షుడు అశ్వక్‌ హుశేన్‌, కోశాధికారి చాంద్‌బాషా పాల్గొన్నారు.


Updated Date - 2022-06-25T06:33:39+05:30 IST