
అమరావతి: వైసీపీ కీలక నేతలతో సీఎం జగన్ సమావేశం ప్రారంభమైంది. ఈ సమావేశానికి మంత్రులు, జిల్లా పార్టీ అధ్యక్షులు, పార్టీ రీజినల్ కో ఆర్డినేటర్లు హాజరైయ్యారు. 2024 ఎన్నికల కసరత్తుపై దృష్టిసారించారు. నేతల మధ్య సమన్వయంపై జగన్ కీలక సూచనలు ఇచ్చారు. మంత్రులు,రీజినల్ కోర్దినేటర్లు, పార్టీ జిల్లా అధ్యక్షులు కోఆర్డినెట్ చేసుకోవాలని సీఎం సూచనలు చేసినట్లు తెలిసింది. అలాగే ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలు జనంలోకి తీసుకు వెళ్ళేవిధంగా మంత్రులు జిల్లా అధ్యక్షులు మధ్య సమన్వయం ఉండాలని సూచించారు. ప్రతి ఇంటికి ప్రభుత్వ సంక్షేమం ఎంత అందుతోంది తెలిపేలా ప్రణాళిక సిద్దం చేయాలన్నారు. పార్టీ బలోపేతం, నేతల మధ్య సమన్వయంపై జగన్ దిశానిర్దేశం చేయనున్నారు. సార్వత్రిక ఎన్నికలు, అదే విధంగా సీఎం జిల్లా పర్యటనలు, టూర్ షెడ్యూల్ పై కూడా చర్చలు జరిపారు.
ఇవి కూడా చదవండి