YCP ప్లీనరీలోనూ TDPపై జగన్ అక్కసు

ABN , First Publish Date - 2022-07-08T18:02:34+05:30 IST

వైసీపీ ప్లీనరీలోనూ టీడీపీపై సీఎం జగన్ అక్కసు వెల్లగక్కారు.

YCP ప్లీనరీలోనూ TDPపై జగన్ అక్కసు

గుంటూరు: వైసీపీ (YCP) ప్లీనరీలోనూ టీడీపీ(TDP)పై సీఎం జగన్(Jagan) అక్కసు వెల్లగక్కారు. తామేం చేశామో చెబుతూ ప్రజల వద్దకు వెళితే ఆదరిస్తున్నారని అసత్యాలు చెబుతున్నారని తెలిపారు. రాజకీయ వ్యవస్ధలో మార్పు అంటే ఏంటో వైసీపీ చూపించిందన్నారు. గ్రామ పాలనను అవినీతి లేకుండా వివక్షలేకుండా మార్చి చూపించామన్నారు. పేదవాడి సొంతింటి కలను చేసి చూపించామంటూ జగన్ అసత్యాలు వల్లెవేశారు. ప్రభుత్వ జీఓలను ఉంచే వెబ్ సైట్లను మూసివేసిన జగన్ సర్కార్... తమ ప్రభుత్వం పారదర్శక పాలన అందించిందంటూ సీఎం ప్లీనరీ వేదికగా వ్యాఖ్యలు చేశారు. 


Updated Date - 2022-07-08T18:02:34+05:30 IST