ఆ కేసుల పరిష్కారానికి ప్రయత్నాలు చేయాలి: సీఎం జగన్‌

ABN , First Publish Date - 2022-04-27T01:05:45+05:30 IST

లెక్టర్లు, ఎస్పీలు, అధికారులతో సీఎం జగన్‌ వీడియోకాన్ఫరెన్స్‌ నిర్వహించారు. స్పందన కార్యక్రమం కింద వచ్చిన ఆర్జీల పరిష్కారంపై చర్చించారు.

ఆ కేసుల పరిష్కారానికి ప్రయత్నాలు చేయాలి: సీఎం జగన్‌

అమరావతి: కలెక్టర్లు, ఎస్పీలు, అధికారులతో సీఎం జగన్‌ వీడియోకాన్ఫరెన్స్‌ నిర్వహించారు. స్పందన కార్యక్రమం కింద వచ్చిన ఆర్జీల పరిష్కారానికి చర్యలు చేపట్టాలని అధికారులను సీఎం ఆదేశించారు.  ఈ సమావేశంలో పలు కీలక అంశాలపై చర్చించారు. ఈసందర్భంగా సీఎం జగన్ వీడియోకాన్ఫరెన్స్‌‌లో పలు సమస్యలపై స్పందించారు. ‘‘జిల్లాల పునర్విభజన ఎందుకు చేశామన్న విషయం అందరికీ తెలియాలి. ఏప్రిల్, మే, జూన్‌లో ఉపాధిహామీ కింద ముమ్మరంగా పనులు చేపట్టాలి. ఈ 3 నెలల్లో పనులు పూర్తి చేయడంపై కలెక్టర్లు దృష్టిపెట్టాలి.కేంద్రం నుంచి రావాల్సిన ఉపాధిహామీ నిధులు..ఈ నెలాఖరులోగా వచ్చేలా ప్రయత్నాలు చేస్తున్నాం.డిసెంబర్‌ నాటికి 4,545 డిజిటల్‌ లైబ్రరీల నిర్మాణం పూర్తికావాలి.గ్రామాలకు ఇంటర్నెట్ కేబుల్‌ని అనుసంధానిస్తాం.గ్రామాల్లోనూ వర్క్‌ఫ్రంహోం అందుబాటులోకి వస్తుంది’’ అని జగన్‌ తెలిపారు.


‘‘సిమెంటు, స్టీలు, ఇసుక, మెటల్‌ సరఫరా సవ్యంగా సాగేలా నోడల్‌ అధికారికి బాధ్యతలు అప్పగించాలి.. అదే సమయానికి ఇంటర్నెట్‌ కేబుల్‌ కూడా సంబంధిత గ్రామాలకు చేరుకుంటుంది.తొలిదశలో 15.6 లక్షల ఇళ్ల నిర్మాణం లక్ష్యంగా పెట్టుకున్నాం. ఇళ్ల నిర్మాణంపై  కూడా దృష్టిపెట్టాలి. ఇళ్ల పట్టాలపై ఉన్న కేసుల పరిష్కారానికి ప్రయత్నాలు చేయాలి.వీలుకాని పక్షంలో ప్రత్యామ్నాయ స్థలాలను ఎంపిక చేయాలి.అర్హులందరికీ ఇళ్లస్థలాలు ఇవ్వాల్సిందే.. దీనికి ఎంత ఖర్చైనా ప్రభుత్వం ఇవ్వడానికి సిద్ధంగా ఉంది.ఇళ్ల నిర్మాణం కార్యక్రమంలో చురుగ్గా పాల్గొన్న స్థానిక ప్రజాప్రతినిధులను సత్కరిస్తాం.మండలానికో సర్పంచి, మున్సిపాల్టీలో కౌన్సిలర్, ప్రతి జిల్లాలో ఒక ఎంపీపీ, ఒక జడ్పీటీసీ చొప్పున అవార్డులు ఇస్తాం.ఇళ్ల నిర్మాణం, స్కూళ్లు, ఆస్పత్రుల్లో నాడు – నేడు, సమగ్ర భూసర్వే, స్పందనలో అర్జీల పరిష్కారంలో నాణ్యత, ఎస్‌డీజీ లక్ష్యాలు, ఉపాధిహామీ పనులు, సచివాలయాల పనితీరు... ఈ అంశాల్లో ప్రగతి ఆధారంగా కలెక్టర్లు, జేసీల పనితీరును మదింపు చేస్తాం.ఏసీబీ, ఎస్‌ఈబీ, దిశ, సోషల్‌మీడియా ద్వారా వేధింపుల నివారణ అంశాల్లో ప్రగతి ఆధారంగా ఎస్పీల పనితీరును మదింపు చేస్తాం.ఎప్పటికప్పుడు  అధికారులు క్రమం తప్పకుండా సమీక్షలు నిర్వహించి ముందుకు సాగాలి. గంటలోపే సమీక్ష చేసుకుని.. పనిలో ముందుకుసాగాలి’’ అని సీఎం జగన్ అధికారులను ఆదేశించారు.

Updated Date - 2022-04-27T01:05:45+05:30 IST