CM KCR.. ఆయన కోసం హెలికాఫ్టర్ పంపిన సీఎం కేసీఆర్

ABN , First Publish Date - 2022-10-05T17:38:31+05:30 IST

సీఎం కేసీఆర్ స్పీకర్ పోచారం శ్రీనివాస రెడ్డి కోసం హెలికాఫ్టర్ పంపారు.

CM KCR.. ఆయన కోసం హెలికాఫ్టర్ పంపిన సీఎం కేసీఆర్

హైదరాబాద్ (Hyderabad): స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి (Pocharam Srinivas Reddy) బుధవారం అందుబాటులో ఉండాలని కోరుతూ ఆయన కోసం ముఖ్యమంత్రి కేసీఆర్ (CM KCR) హెలికాఫ్టర్ (Helicopter) పంపారు. దీంతో సభాపతి బాన్సువాడ నుంచి హెలికాప్టర్‌లో హైదరాబాద్ బయలుదేరారు. ఇవాళ ఇక్కడ జరిగే కేసీఆర్ జాతీయ పార్టీ ఆవిష్కరణలో పోచారం శ్రీనివాస్ రెడ్డి పాల్గొననున్నారు. స్పీకర్ వెంట ఆయన తనయులు డీసీసీబీ చైర్మన్ పోచారం భాస్కర్ రెడ్డి, పోచారం సురేందర్ రెడ్డి ఉన్నారు. ఈ కార్యక్రమం ముగిసిన తర్వాత పోచారం శ్రీనివాస్ రెడ్డి తిరిగి సాయంత్రం బాన్సువాడలో జరిగే రావణ దహన కార్యక్రమానికి ప్రత్యేక హెలికాప్టర్‌లో బయలుదేరనున్నారు.


మరి కాసేపట్లో తెలంగాణ భవన్లో టీఆర్ఎస్ సర్వసభ్య సమావేశం జరగనుంది. ఈ భేటీలో ప్రధానంగా టీఆర్ఎస్ పేరు మార్పుపై తీర్మానం, సంతకాల సేకరణ జరుగుతుంది. మధ్యాహ్నం 1.19 నిముషాలకు టీఆర్ఎస్ పార్టీ పేరు మార్పు, కొత్త పేరు ప్రకటన జరగనుంది. ఈ నేపథ్యంలో ప్రగతిభవన్లో సీఎం కేసీఆర్తో కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామి సమావేశమయ్యారు. జేడీయూ ఎమ్మెల్యేలతో కలిసి ఆయన ప్రగతిభవన్కు వచ్చారు. అలాగే తమిళనాడు వీసీకే అధ్యక్షుడు తిరుమావలవన్ ఇద్దరు ఎంపీలు, నలుగురు ఎమ్మెల్యేలతో వచ్చి కేసీఆర్‌ను కలిసారు.


కాగా టీఆర్ఎస్ కార్యవర్గ సమావేశానికి మీడియాకు అనుమతి లేదని ప్రగతిభవన్ సిబ్బంది చెబుతూ కార్యాలయం నుంచి మీడియాను బలవంతంగా.. బయటకు పంపించారు. మధ్యాహ్నం ప్రెస్మీట్ ఉంటే చెబుతామన్నారు. ఈ క్రమంలో మీడియా సిబ్బంది పట్ల పోలీసుల దురుసుగా ప్రవర్తించారు. సీఎం కేసీఆర్ ఆదేశాలతోనే బయటకు పంపుతున్నామని టీఆర్ఎస్ నేతలు తెలిపారు.

Updated Date - 2022-10-05T17:38:31+05:30 IST