ఈటలతో అయ్యేది కాదు.. పోయేది కాదు: CM KCR

ABN , First Publish Date - 2021-07-24T22:57:44+05:30 IST

సోషల్ మీడియాలో సీఎం కేసీఆర్ ఆడియో ఒకటి వైరల్ అవుతోంది. ఈటల రాజేందర్ చాలా చిన్నోడు అంటూ సీఎం కేసీఆర్ వ్యాఖ్యానించారు.

ఈటలతో అయ్యేది కాదు.. పోయేది కాదు: CM KCR

హైదరాబాద్: సోషల్ మీడియాలో సీఎం కేసీఆర్ ఆడియో ఒకటి వైరల్ అవుతోంది. ఈటల రాజేందర్ చాలా చిన్నోడు అంటూ సీఎం కేసీఆర్ వ్యాఖ్యానించడం సంచలనంగా మారింది. ఈటల రాజేందర్‌తో అయ్యేది కాదు.. పోయేది కాదంటూ ఆయన తనదైన శైలిలో మాట్లాడారు. ఈటల రాజేందర్‌ను పట్టించుకోవాల్సిన అవసరం లేదన్నారు. దళిత బంధు మంచి పథకమని, హుజూరాబాద్ మాత్రమే కాదు.. రాష్ట్రమంతా దళితులు బాగుపడుతారని సీఎం కేసీఆర్ అన్నారు. హుజూరాబాద్ నియోజకవర్గంలోని తనగుల ఎంపీటీసీ నిరోష భర్త రామస్వామితో సీఎం కేసీఆర్ చేసిన ఈ ఫోన్ సంభాషణ రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది. 



Updated Date - 2021-07-24T22:57:44+05:30 IST