TS Cabinet: నేడు క్యాబినెట్‌ సమావేశం

ABN , First Publish Date - 2022-08-11T12:01:56+05:30 IST

ముఖ్యమంత్రి కేసీఆర్‌ (CM KCR) అధ్యక్షతన గురువారం మంత్రివర్గ సమావేశం నిర్వహించనున్నారు.

TS Cabinet: నేడు క్యాబినెట్‌ సమావేశం

హైదరాబాద్‌: ముఖ్యమంత్రి కేసీఆర్‌ (CM KCR) అధ్యక్షతన గురువారం మంత్రివర్గ సమావేశం నిర్వహించనున్నారు. మధ్యాహ్నం 3 గంటలకు క్యాబినెట్‌ (Cabinet) సమావేశం ప్రారంభమవుతుంది. నిధుల సమీకరణ, పథకాల అమలు ఎజెండాగా క్యాబినెట్‌ సమావేశం నిర్వహిస్తున్నారు. ఆగస్టు 15 నుంచి కొత్తగా ఇస్తామన్న రూ.10 లక్షల పింఛన్లకు సంబంధించి కూడా ఈ సమావేశంలో ప్రధానంగా చర్చిస్తారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న దళితబంధు పథకం రెండో దశ అమలు, అవసరమైన నిధుల కేటాయింపుపైనా చర్చ జరగనుంది. మరోవైపు స్వతంత్ర భారత వజ్రోత్సవాల సందర్భంగా నిర్వహిస్తున్న కార్యక్రమాలకు సంబంధించి ఒక రోజు శాసనసభ ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఈ నెల 21న అసెంబ్లీ సమావేశం ఏర్పాటుపై చర్చించి నిర్ణయం తీసుకోనున్నారు. ప్రాజెక్టులను ఆదుకోవడానికి నిధులు అందించే అంశంపై చర్చించనున్నారు. అలాగే, నీటిపారుదల శాఖలో అడ్‌హక్‌ సీనియారిటీ రూల్స్‌కు మంత్రివర్గం ఆమోదం తెలిపే అవకాశాలున్నాయి. దీంతోపాటు ఇన్‌చార్జీ ప్రాతిపదికన పనిచేస్తున్న ఇంజనీర్లకు రివర్షన్ల సమస్య నుంచి ఉపశమనం కల్పించడానికి వీలుగా 12 సూపర్‌న్యుమరరీ పోస్టుల సృష్టికి కూడా మంత్రివర్గం ఆమోదం తెలుపనుంది. 

Updated Date - 2022-08-11T12:01:56+05:30 IST