దమ్ముంటే టీఆర్ఎస్ ప్రభుత్వాన్నికూల్చండి చూస్తాం:Kcr

ABN , First Publish Date - 2022-07-02T20:47:02+05:30 IST

కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం రాజ్యాంగ సంస్థలను దుర్వినియోగం చేస్తున్నారని ముఖ్యమంత్రి కేసీఆర్‌(kcr) ఆరోపించారు.

దమ్ముంటే టీఆర్ఎస్ ప్రభుత్వాన్నికూల్చండి చూస్తాం:Kcr

హైదరాబాద్: కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం రాజ్యాంగ సంస్థలను దుర్వినియోగం చేస్తున్నారని ముఖ్యమంత్రి కేసీఆర్‌(kcr) ఆరోపించారు. బీజేపీకి(bjp) వ్యతిరేకంగా మాట్లాడినవారిని ఇబ్బందులు పెడుతున్నారని అన్నారు. మేము సైలెంట్‌గా ఉండం, పోరాడుతూనే ఉంటామని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు. జలవిహార్ లో జరిగిన యశ్వంత్ సిన్హా ప్రచార సభలో కేసీఆర్ మాట్లాడారు.టీఆర్ఎస్ ప్రభుత్వం కూలుతుందని బీజేపీ నేతలు మాట్లాడుతున్నారు.మహారాష్ట్ర తరహాలో తెలంగాణలోనూ పడగొట్టాలని భావిస్తున్నారు. దమ్ముంటే టీఆర్ఎస్‌ ప్రభుత్వాన్ని కూల్చండి..చూస్తాం అంటూ కేసీఆర్ సవాల్ విసిరారు. మేము ఢిల్లీలో మీ ప్రభుత్వాన్ని కూల్చుతాం.మీరు ఎంత అవినీతి చేశారో, మీ స్నేహితులైన వ్యాపారులకు.ఎంత దోచి పెట్టారో మా దగ్గర లెక్కలున్నాయని కేసీఆర్‌ పేర్కొన్నారు.బీజేపీ అవినీతి చిట్టా త్వరలోనే బయటపెడతామని కేసీఆర్ స్పష్టం చేశారు. 

Updated Date - 2022-07-02T20:47:02+05:30 IST