అఫ్ఘనిస్థాన్‌ వెళ్లాలని మాట్లాడతారా?: సీఎం కేసీఆర్‌

ABN , First Publish Date - 2021-11-09T00:30:55+05:30 IST

పెట్రోల్‌ ధరలు ఎందుకు పెంచారని ప్రజలు అడిగితే అఫ్ఘనిస్థాన్‌ వెళ్లాలని

అఫ్ఘనిస్థాన్‌ వెళ్లాలని మాట్లాడతారా?: సీఎం కేసీఆర్‌

హైదరాబాద్: పెట్రోల్‌ ధరలు ఎందుకు పెంచారని ప్రజలు అడిగితే అఫ్ఘనిస్థాన్‌ వెళ్లాలని చీప్‌గా మాట్లాడతారా అని బీజేపీ నాయకులపై సీఎం కేసీఆర్‌ ఆగ్రహం వ్యక్తం చేసారు. కేంద్ర ప్రభుత్వంపై సీఎం కేసీఆర్‌ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. సోమవారం హైదరాబాద్‌లో ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. పెట్రోల్‌ ధరలు పెంచి దేశ ప్రజల మీద భారం వేయొద్దన్నారు. పెట్రోల్‌, డీజిల్‌ మీద పన్నును కేంద్రం విత్‌డ్రా చేసుకోవాలని ఆయన డిమాండ్ చేసారు. కేంద్రం పన్ను విత్‌డ్రా చేసుకుంటే పెట్రోల్ ధర లీటర్‌ 60కే వస్తుందన్నారు. కేంద్రం ఇవ్వడానికి సిద్ధంగా ఉందా.. లేదో.. తమ పాలసీని ప్రకటించాలని డిమాండ్ చేసారు. పెట్రోల్‌ ధరలు ఎందుకు పెంచారని ప్రజలు అడిగితే అఫ్ఘానిస్థాన్‌ వెళ్లాలని చీప్‌గా మాట్లాడతారా అని సీఎం కేసీఆర్‌ ఆగ్రహం వ్యక్తం చేసారు. డీజిల్‌, పెట్రోల్‌పై సెస్‌ విత్‌డ్రా చేయాలన్నారు. సెస్‌ విత్‌డ్రా చేస్తరా, లేదో కేంద్రం చెప్పాలని కేసీఆర్  డిమాండ్ చేసారు. 

Updated Date - 2021-11-09T00:30:55+05:30 IST