మైనార్టీల అభివృద్ధికి సీఎం కేసీఆర్‌ కృషి

ABN , First Publish Date - 2021-05-07T06:49:35+05:30 IST

రాష్ట్రంలో మైనార్టీల అభి వృద్ధి కోసం సీఎం కేసీఆర్‌ ఎంతో కృషి చేస్తున్నారని సిరిసిల్ల మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ జిందం కళాచక్రపా ణి అన్నారు.

మైనార్టీల అభివృద్ధికి సీఎం కేసీఆర్‌ కృషి
సిరిసిల్లలో దుస్తులను పంపిణీ చేస్తున్న చైర్‌పర్సన్‌ కళాచక్రపాణి

- సిరిసిల్ల మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ జిందం కళాచక్రపాణి

 సిరిసిల్ల టౌన్‌, మే 6: రాష్ట్రంలో  మైనార్టీల అభి వృద్ధి కోసం సీఎం కేసీఆర్‌ ఎంతో కృషి చేస్తున్నారని సిరిసిల్ల మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ జిందం కళాచక్రపా ణి అన్నారు. గురువారం సిరిసిల్ల పట్టణం మజీద్‌ వద్ద ఏర్పాటు చేసిన సమావేశంలో ప్రభుత్వం అందిస్తున్న రంజాన్‌ తోఫా బట్టలను పేద ముస్లిం లకు చైర్‌పర్సన్‌ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా కళచక్రపాణి మాట్లాడుతూ అన్ని మతాల ఆచారాల ను సంప్రదాయాలను గౌరవిస్తున్నారన్నారు. కార్య క్రమంలో తహసీల్దార్‌ మల్లారెడ్డి, కౌన్సిలర్‌ పద్మ, కో ఆప్షన్‌ సభ్యులు ఎండీ సలీం, ఎండీ ఆస్మా మునీర్‌, మజీద్‌ కమిటీ అధ్యక్షడు షేక్‌ యూసుబ్‌, ఉపాధ్యక్షుడు ఎండీ ము నీర్‌, ప్రధాన కార్యదర్శి ఎండీ రఫీ, సీనియర్‌ అడ్వై జర్‌లు సయీద్‌ఖాన్‌, అబ్దుల్‌ సత్తార్‌, అబ్దుల్‌ ఖాద ర్‌, సభ్యుల సయ్యద్‌ జహంగీర్‌, ఎండీ నయీమ్‌, మహమూద్‌, సయ్యద్‌, జావిద్‌, ఎస్‌డీ సలీం, ఎండీ పాషా, మతీన్‌, రఫీఉద్దీన్‌, పాషా, వాజీద్‌, ఇమ్రాన్‌ తదితరులు పాల్గొన్నారు.

- బోయినపల్లి: రంజాన్‌ సందర్భంగా ముస్లిం లకు ఎమ్మెల్యే సుంకె రవిశంకర్‌ దుస్తులను పంపి ణీ చేశారు. అనంతరం మండలంలోని వివిధ గ్రా మాలకు చెందిన 20 మందికి సీఎంఆర్‌ఎఫ్‌ చెక్కు లను ఎమ్మెల్యే పంపిణీ చేశారు.  ఎంపీపీ పర్లపల్లి వేణుగోపాల్‌, వైస్‌ ఎంపీపీ నాగయ్య, నాయకులు కత్తెరపాక కొండయ్య, కవ్వంపల్లి రాములు, గుంటి శంకర్‌ తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2021-05-07T06:49:35+05:30 IST