ధాన్యం కొనుగోళ్లపై కేంద్రానికి కేసీఆర్ 24 గంటల డెడ్‌లైన్‌

ABN , First Publish Date - 2022-04-11T18:55:49+05:30 IST

రైతుల వద్ద ధాన్యం కొనాలని టీఆర్ఎస్ ఢిల్లీలో రైతుల దీక్ష చేపట్టింది.

ధాన్యం కొనుగోళ్లపై కేంద్రానికి కేసీఆర్ 24 గంటల డెడ్‌లైన్‌

ఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం రైతుల వద్ద ధాన్యం కొనాలని టీఆర్ఎస్ ఢిల్లీలో రైతుల దీక్ష చేపట్టింది. కేంద్ర విధానాలపై సీఎం కేసీఆర్ సమరశంఖం పూరించారు. ఈ సందర్బంగా కేసీఆర్ మాట్లాడుతూ.. ‘‘కేంద్రం ధాన్యం కొనాలని ఢిల్లీలో దీక్ష చేస్తున్నాం. ధాన్యం కొనుగోలుపై కేంద్రానికి 24 గంటల డెడ్‌లైన్‌ విధించాం. 24 గంటలలోపు ధాన్యం కొనుగోలుపై నిర్ణయం తీసుకోవాలి. లేకపోతే రైతు ఉద్యమంతో భూకంపం సృష్టిస్తాం రైతు సమస్యలపై కేంద్రంతో తాడోపేడో తేల్చుకుంటాం. ఎవరితోనైనా గొడవ పచొచ్చు కానీ.. రైతులతో పడవద్దు.ప్రభుత్వంలో ఎవరూ శాశ్వతంగా ఉండరు. రైతులను కన్నీరు పెట్టిస్తే ఆ పాపం ఊరికేపోదు.ఒకే విధానం లేకపోతే రైతులు రోడ్లపైకి రావాల్సి వస్తుంది.కేంద్రాన్ని గద్దెదించే సత్తా రైతులకు ఉంది.తెలంగాణ ఓట్లు, సీట్లు కావాలి కానీ.. ధాన్యం వద్దా?.రైతుల విషయంలో కేంద్రంతో తాడోపేడో తేల్చుకుంటాం’’అని కేసీఆర్ కేంద్రంపై ధ్వజమెత్తారు.


షీయూష్‌ గోయల్‌ కాదు.. పీయూష్‌ గోల్‌మాల్‌

‘‘కేంద్రమంత్రి రైతులను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు బాధాకరం.షీయూల్‌ గోయల్‌ తెలంగాణ రైతులు నూకలు తినాలని చెప్పారు.మేం గోయల్‌ దగ్గర అడుక్కోవడానికి వచ్చామా?.షీయూష్‌ గోయల్‌ కాదు.. పీయూష్‌ గోల్‌మాల్‌.గోయల్‌ ఇంత సంస్కారహీనంగా ఎలా మాట్లాడారు.దేశవ్యాప్తంగా ఎక్కడా లేని 30 లక్షల బోర్లు తెలంగాణలో ఉన్నాయి.మోటార్‌, విద్యుత్‌ తీగలు, బోర్ల కోసం వేల కోట్లు ఖర్చు చేస్తున్నాం.ఉమ్మడి రాష్ట్రంలో సాగు రంగం తీవ్ర నిర్లక్ష్యానికి గురైంది.6 దశాబ్దాల పాటు ప్రత్యేక రాష్ట్రం కోసం పోరాటం చేశాం.ఉద్యమాల పోరాట ఫలితంగా 2014లో తెలంగాణ వచ్చింది.రాష్ట్రం వచ్చాక రైతుల కోసం అనేక సంస్కరణలు తెచ్చాం’’ అని కేసీఆర్ పేర్కొన్నారు.


వారికి సిగ్గుండాలి

‘‘మిషన్‌ కాకతీయ ద్వారా చెరువులను పునరుద్ధరించాం.రైతులకు 24 గంటల ఉచిత విద్యుత్‌ ఇస్తున్న రాష్ట్రం తెలంగాణ.గుజరాత్‌లో విద్యుత్‌ కోసం రైతులు ఆందోళనలు చేస్తున్నారు.తెలంగాణలో కోటి ఎకరాల భూమి సాగులోకి వచ్చింది.తికాయత్‌ను దేశద్రోహి అన్నారు.. ఉగ్రవాది అన్నారు. బీజేపీ తెలంగాణ నేతలు మా దీక్షకు పోటీగా హైదరాబాద్‌లో ధర్నా చేస్తారా? సిగ్గుండాలి. పంట మార్పిడి చేయవద్దని మేం రైతులకు చెప్పాం.రైతులు ధాన్యం పండించండి.. కొంటామని బీజేపీ చెప్పింది.కానీ తెలంగాణ బీజేపీ నేతలు మాత్రం రైతులను రెచ్చగొట్టారు’’ అని కేసీఆర్‌ కేంద్రం తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. 

Updated Date - 2022-04-11T18:55:49+05:30 IST