సీఎం కేసీఆర్ కుట్రలో భాగమే: బండి సంజయ్‌

ABN , First Publish Date - 2022-03-04T01:52:30+05:30 IST

మంత్రి శ్రీనివాస్‌గౌడ్ హత్యకు కుట్ర పన్నడం బీజేపీని అప్రతిష్టపాలు చేయడానికి

సీఎం కేసీఆర్ కుట్రలో భాగమే: బండి సంజయ్‌

హైదరాబాద్: మంత్రి శ్రీనివాస్‌గౌడ్ హత్యకు కుట్ర పన్నడం బీజేపీని అప్రతిష్టపాలు చేయడానికి సీఎం కేసీఆర్ పన్నిన కుట్రలో భాగమేనని బీజీపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఆరోపించారు. బీజేపీ నేతలు డీకే అరుణ, జితేందర్ రెడ్డిల ఇళ్ళపై దాడులను ఆయన ఖండించారు. మంత్రి హత్యకు ప్లాన్ చేసిన కుట్రదారుల్లో వ్యూహకర్తలు ఉండొచ్చని ఆయన అనుమానం వ్యక్తం చేశారు. మంత్రుల అవినీతిపై విచారణ సంస్థలను కచ్చితంగా ఆశ్రయిస్తామన్నారు. శ్రీనివాస్‌గౌడ్ అవినీతిని బయటపెడుతున్నందుకే కొత్త నాటకం ఆడుతున్నారని ఆయన మండిపడ్డారు. 

Updated Date - 2022-03-04T01:52:30+05:30 IST