
Hyderabad: ముఖ్యమంత్రి కేసీఆర్ (CM KCR) శుక్రవారం సాయంత్రం 5:30 గంటలకు కీలక సమావేశం నిర్వహించనున్నారు. మంత్రులు, ఫ్లోర్ లీడర్లతో ఆయన ప్రగతి భవన్ (Pragati Bhavan)లో భేటీ కానున్నారు. రాజకీయ, పాలనాపరమైన అంశాలపై చర్చించనున్నారు. అలాగే రాష్ట్రపతి ఎన్నికలపై చర్చించే అవకాశమున్నట్లు సమాచారం.
థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు చేసే దిశలో సీఎం కేసీఆర్ వివిధ రాష్ట్రాలకు సంబంధించిన ముఖ్యమంత్రులతోపాటు ప్రాంతీయపార్టీ అధినేతలతో సమావేశం అయ్యారు. కొద్ది రోజుల క్రితం ప్రశాంత్ కిషోర్ టీమ్‌తో కూడా కేసీఆర్ భేటీ అయ్యారు. రాష్ట్రపతి అభ్యర్ధిత్వానికి సంబంధించి ఉమ్మడి అభ్యర్థిని నిలబెడితే.. రాబోయే పరిణామాలు.. రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న రాజకీయ సమీకరణాలు, దేశవ్యాప్తంగా జరుగుతున్న వివిధ రాజకీయ పరిస్థితులపై ఈరోజు ప్రగతి భవన్‌లో ముఖ్యమంత్రి కేసీఆర్ చర్చించే అవకాశం కనిపిస్తోంది.
ఇవి కూడా చదవండి