CM KCR: జాతీయ రైతు సంఘాల నేతలతో రెండో రోజు సీఎం కేసీఆర్ భేటీ

ABN , First Publish Date - 2022-08-28T18:14:43+05:30 IST

జాతీయ రైతు సంఘాల నేతలతో సీఎం కేసీఆర్ (CM KCR) రెండో రోజు ఆదివారం సమావేశమయ్యారు.

CM KCR: జాతీయ రైతు సంఘాల నేతలతో రెండో రోజు సీఎం కేసీఆర్ భేటీ

హైదరాబాద్ (Hyderabad): జాతీయ రైతు సంఘాల నేతలతో సీఎం కేసీఆర్ (CM KCR) రెండో రోజు ఆదివారం సమావేశమయ్యారు. నిన్నటి నుంచి సమావేశం అవుతున్న ముఖ్యమంత్రి... దేశంలో వ్యవసాయం ఏదుర్కొంటున్న పరిస్థితులు, తీసుకోవాల్సిన చర్యలపై చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. రాష్ట్రంలో వ్యవసాయ రంగంలో నెలకొల్పిన అంశాలపై జాతీయ రైతు సంఘాల నేతలకు సీఎం కేసీఆర్ వివరించనున్నారు.


‘దేశాన్ని సంక్షోభం నుంచి బయటపడేసేందుకు, ప్రజా సంక్షేమం కోరుకునే శక్తులు సంఘర్షణ సాగించాలి’ అని సీఎం కేసీఆర్‌ పిలుపునిచ్చారు. ఈ సంఘర్షణ ప్రారంభ దశలో కలిసివచ్చేవారు కొంత అనుమానాలు, అయితదా? కాదా? అనే అపోహలకు గురవుతుంటారని, ఈ అడ్డంకులన్నింటినీ దాటుకొంటూ ఐక్యత సాధించి లక్ష్యాన్ని చేరుకోవాల్సి ఉంటుందన్నారు. తెలంగాణలో అమలుచేస్తున్న వ్యవసాయం, సాగునీరు, విద్యుత్తు రంగాల అభివృద్థి, రైతు సంక్షేమ కార్యక్రమాలతో పాటు పలు రంగాల్లోని ప్రగతిని   పరిశీలించేందుకు 26 రాష్ట్రాల నుంచి వచ్చిన దాదాపు 100 మంది రైతు సంఘాల నాయకులతో నిన్న జరిగిన భేటీలో సీఎం కేసీఆర్‌ ఈ వ్యాఖ్యలు చేశారు. 

Updated Date - 2022-08-28T18:14:43+05:30 IST