ప్రజల మేలు కోరుతున్న సీఎం కేసీఆర్‌

ABN , First Publish Date - 2021-06-17T05:40:35+05:30 IST

సీఎం కేసీఆర్‌ ప్రజలందరి మేలు కోరుతున్నారని మార్క్‌ఫెడ్‌ రాష్ట్ర డైరెక్టర్‌ శేరి జగన్మోహన్‌రెడ్డి అన్నారు.

ప్రజల మేలు కోరుతున్న సీఎం కేసీఆర్‌
సంగారెడ్డి జిల్లా జోగిపేటలో సీఎం కేసీఆర్‌ చిత్రపటానికి క్షీరాభిషేకం చేస్తున్న జగన్మోహన్‌రెడ్డి

మార్క్‌ఫెడ్‌ రాష్ట్ర డైరెక్టర్‌ శేరి జగన్మోహన్‌రెడ్డి

జోగిపేట/నాగల్‌గిద్ద/రాయికోడ్‌/కంగ్టి, జూన్‌ 16 : సీఎం కేసీఆర్‌ ప్రజలందరి మేలు కోరుతున్నారని మార్క్‌ఫెడ్‌ రాష్ట్ర డైరెక్టర్‌ శేరి జగన్మోహన్‌రెడ్డి అన్నారు. సర్పంచులు, ప్రాదేశిక సభ్యుల వేతనాలను పెంచడంతో బుధవారం జోగిపేటలో కేసీఆర్‌ చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. ఏఎంసీ చైర్మన్‌ ఎం.మల్లికార్జున్‌గుప్తా, ఎంపీపీ అధ్యక్షుడు జోగు బాలయ్య, మున్సిపల్‌ వైస్‌ చైర్మన్‌ ప్రవీణ్‌, కౌన్సిలర్లు దుర్గేశ్‌, చందర్‌, మాజీ కౌన్సిలర్లు గోరే, లక్ష్మణ్‌, పార్టీ పట్టణ అధ్యక్షుడు చాపల వెంకటేశం, ఆత్మ డైరెక్టర్‌ మహేశ్‌యాదవ్‌ పాల్గొన్నారు. ఇదిలా ఉండగా జడ్పీటీసీ సభ్యుల ఫోరం రాష్ట్ర అధ్యక్షుడు, అందోలు జడ్పీటీసీ కె.రమేశ్‌ ఆధ్వర్యంలో మండలంలోని అక్సాన్‌పల్లిలో కేసీఆర్‌ చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. నాగల్‌గిద్ద మండలంలో సర్పంచుల ఫోరం మండల అధ్యక్షుడు పండరియాదవ్‌, సంజీవరెడ్డి ఆధ్వర్యంలో సీఎం సీఎం కేసీఆర్‌కు కృతజ్ఞతలు తెలిపారు. రాయికోడ్‌ మండలంలోని ఎంపీడీవో కార్యాలయంలో కేసీఆర్‌ చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. కంగ్టి మండలంలో సర్పంచుల ఫోరం మండల అధ్యక్షుడు సిద్ధుపాటిల్‌, ఎంపీటీసీల ఫోరం అధ్యక్షుడు రుక్మిణీఅంబాజీ కేసీఆర్‌కు కృతజ్ఞతలు తెలిపారు. 

మెదక్‌ జిల్లాలో

హవేళీఘణపూర్‌/అల్లాదుర్గం/రేగోడు,జూన్‌ 16 : ప్రభుత్వ ఉద్యోగులతో పాటు ప్రజాప్రతినిధులకు వేతనాలు పెంచినందున మండల కేంద్రమైన హవేళీఘణపూర్‌లో ప్రజాప్రతినిధులు సీఎం కేసీఆర్‌ చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. టీఆర్‌ఎస్‌ మండల అధ్యక్షుడు శ్రీనివా్‌సరెడ్డి, వైస్‌ ఎంపీపీ రాధాకిషన్‌యాదవ్‌, ఎంపీటీసీ మాణిక్యరెడ్డి, సర్పంచులు పాల్గొన్నారు. అల్లాదుర్గం మండలం, గడిపెద్దాపూర్‌లో సీఎం కేసీఆర్‌ చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. సర్పంచులు అంజీయాదవ్‌, బేతయ్య, దశరథ్‌, రంజిత్‌, కో ఆప్షన్‌ సభ్యులు సయ్యద్‌, అంగన్‌వాడీ, ఆశావర్కర్లు పాల్గొన్నారు. రేగోడు మండలంలో రైతువేదిక వద్ద టీఆర్‌ఎస్‌ మండల అధ్యక్షుడు బుచ్చయ్య ఆధ్వర్యంలో సీఎం కేసీఆర్‌ చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. టీఆర్‌ఎస్‌ మాజీ అధ్యక్షుడు వినోద్‌కుమార్‌, ప్రధాన కార్యదర్శి రమేష్‌, ఏఎంసీ డైరెక్టర్‌ భూంరెడ్డి, సర్పంచులు తదితరులు పాల్గొన్నారు. 

పంట సాగుకోసమే రైతుబంధు

వట్‌పల్లి/పుల్‌కల్‌, జూన్‌ 15 : పంటల సాగుకోసం రైతులు అప్పుల పాలు కాకూడదన్న సంకల్పంతో కేసీఆర్‌ రైతుబంధు పథకాన్ని ప్రవేశపెట్టారని రైతు వరం కమిటీ చైర్మన్‌ వీరారెడ్డి, రైతుబంధు సమితి మండల అధ్యక్షుడు అశోక్‌గౌడ్‌ తెలిపారు. రైతుబంధు ఆర్థిక సహాయం అందించడంతో బుధవారం వట్‌పల్లిలో కేసీఆర్‌ చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ నర్సింహులు, మార్కెట్‌ కమిటీ డైరెక్టర్లు శ్రీనివా్‌సగౌడ్‌, ఘని, మధు పాల్గొన్నారు. మండల కేంద్రమైన చౌటకూర్‌ రైతువేదిక వద్ద సీఎం కేసీఆర్‌ చిత్రపటానికి టీఆర్‌ఎస్‌ శ్రేణులు బుధవారం క్షీరాభిషేకం చేశారు. ఈ కార్యక్రమంలో టీఆర్‌ఎస్‌ ఉమ్మడి మండలాధ్యక్షుడు చౌకంపల్లి శివకుమార్‌, సర్పంచ్‌ కొల్కూరి వీరమణిమొగులయ్య, ఎంపీటీసీ సరితభూపాల్‌రెడ్డి, ఎస్సీ సెల్‌ ప్రధాన కార్యదర్శి తలారి దేవయ్య పాల్గొన్నారు. 

Updated Date - 2021-06-17T05:40:35+05:30 IST