యువత సంక్షేమానికి సీఎం కేసీఆర్‌ ప్రత్యేక కృషి

ABN , First Publish Date - 2021-04-18T05:24:57+05:30 IST

యువత సంక్షేమానికి సీఎం కేసీఆర్‌ ప్రత్యేక కృషి చేస్తున్నారని రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్‌ అన్నారు. పట్టణంలోని సుమంగలి గార్డెన్స్‌లో శనివారం షెడ్యూల్‌ కులాల వార్షిక ప్రణాళిక 2018-19 ఎస్సీ కార్పొరేషన్‌ ద్వారా ఎంపికైన లబ్ధిదారులకు యూనిట్ల గ్రౌండింగ్‌, అవగాహణ కార్యక్రమానికి మంత్రి కొప్పుల ఈశ్వర్‌ హాజరయ్యారు.

యువత సంక్షేమానికి సీఎం కేసీఆర్‌ ప్రత్యేక కృషి
లబ్ధిదారులకు ప్రొసీడింగ్‌ పత్రాలను అందిస్తున్న మంత్రి కొప్పుల

 రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్‌

జగిత్యాల, ఏప్రిల్‌ 17 (ఆంధ్రజ్యోతి): యువత సంక్షేమానికి సీఎం కేసీఆర్‌ ప్రత్యేక కృషి చేస్తున్నారని రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్‌ అన్నా రు. పట్టణంలోని సుమంగలి గార్డెన్స్‌లో శనివారం షెడ్యూల్‌ కులాల వార్షిక ప్రణాళిక 2018-19 ఎస్సీ కార్పొరేషన్‌ ద్వారా ఎంపికైన లబ్ధిదారులకు యూనిట్ల గ్రౌండింగ్‌, అవగాహణ కార్యక్రమానికి మంత్రి కొప్పుల ఈశ్వర్‌ హాజరయ్యారు. జిల్లా వ్యాప్తంగా వివిధ పథకాల కింద ఎంపికయిన 248 మంది లబ్ధిదారులకు ప్రొసీడింగ్‌ పత్రాలను అందించారు. లబ్ధిదారులకు రూ. 3.20 కోట్ల సబ్సిడీని ప్రభుత్వం విడుదల చేసిందన్నారు. గతంలో ఉమ్మడి రాష్ట్రంలో కేవలం 20శాతం సబ్సిడీపై లబ్ధిదారులకు రుణాలు ఇచ్చారన్నారు. కేవలం మండలా నికి ఒకరిద్దరికి మాత్రమే రుణాలు అందించి చేతులు దులుపుకున్నారన్నారు. ప్రస్తుతం టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం వేలాది సంఖ్యలో ఎస్సీ నిరుద్యోగ యువతీ యువకులకు రూ. కోట్లలో రుణాలు అందిస్తుందన్నారు. డాక్టర్‌ అంబేద్కర్‌ ఆశయాలకు అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తుందన్నారు. రుణాలు తీసుకున్న యువతీ యువకులు ఎంపిక చేసుకున్న యూనిట్లను విజయవం తంగా నిర్వహించాలని సూచించారు. ఎస్సీ రుణాలను పొందడానికి యువత ఆసక్తి చూపడం లేదన్నారు. చదువుకున్న వ్యక్తులందరికీ ప్రభుత్వ ఉద్యోగాలు లభించడం అసాధ్యమన్నారు. యువత స్వయం ఉపాధి వైపు అడుగులు వేయాలన్నారు. పాడి పరిశ్రమలను, ఫౌలీ్ట్రఫామ్‌లను నెలకొల్పడానికి యువత ముందుకురావాలన్నారు. సబ్సిడీ రుణాలను సకాలంలో చెల్లించి ప్రభుత్వానికి సహకరించాలని సూచించారు. రుణాలు సకాలంలో చెల్లిస్తేనే తిరిగి అదనంగా  రుణాలు అందించడం సాధ్యమవుతుందన్నారు. 2020 -21 సంవత్సరంలో రుణాలను పొందడానికి 1.70 లక్షల మంది నిరుద్యోగులు స్వయం ఉపాధి రుణాలు పొందడానికి ధరఖాస్తులు సమర్పించారన్నారు. భూ అభివృద్ధి పథకం కింద రూ.3.50 లక్షల  రుణం అందిస్తున్నామన్నారు. దీనికింద సం బంధిత భూమిలో విద్యుత్‌ సౌకర్యం, మోటారు, బావి నిర్మాణం తదితర పను లు చేసుకోవచ్చన్నారు. ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ బాలుర, బాలికల గురుకుల పాఠశాలలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్‌ గుగులోతు రవినాయక్‌, జగిత్యాల, చొప్పదండి ఎమ్మెల్యేలు డాక్టర్‌ సంజయ్‌ కుమార్‌, రవి శంకర్‌,  జడ్పీ చైర్‌పర్సన్‌ దావ వసంత, డీసీఎంఎస్‌ చైర్మన్‌ శ్రీకాంత్‌ రెడ్డి, ఎస్సీ డెవలప్‌మెంట్‌ అధికారి లక్ష్మి నారాయణ, పలువురు జడ్పీటీసీలు, ఎంపీపీలు, ఎంపీటీసీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

రోళ్లవాగు ప్రాజెక్టు పనులను వేగవంతం చేయాలి

రోళ్లవాగు ప్రాజెక్టు పనులను మరింత వేగవంతం చేయాలని రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్‌ అధికారులను ఆదేశించారు. శనివారం పట్టణం లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్‌ సంజయ్‌ కుమార్‌, జడ్పీ చైర్‌పర్సన్‌ దావ వసంతలతో కలిసి రోళ్లవాగు ప్రాజెక్టు పనులపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. జిల్లాలోని బీర్పూర్‌ మండలం లో నిర్మితమవుతున్న రోళ్లవాగు ప్రాజక్టు పనుల గురించి డీఈ చక్రునాయక్‌ వివరించారు. రోళ్లవాగు ప్రాజెక్టు నిర్మాణానికి అవసరమైన మట్టిని అటవీశాఖ నుంచి ఇప్పటివరకు సేకరిస్తున్నామని వివరించారు.  ఈ సందర్భంగా మంత్రి కొప్పుల ఈశ్వర్‌ మాట్లాడారు. రోళ్లవాగు ప్రాజెక్టు పనుల నిర్వహణలో ఎటు వంటి ఇబ్బందులు ఎదురైనా వెంటనే తెలిపితే పరిష్కారానికి అవసరమైన చర్యలు తీసుకుంటామన్నారు. 

Updated Date - 2021-04-18T05:24:57+05:30 IST