Heavy rains: భారీ వర్షాలపై ప్రగతి భవన్‌లో కేసీఆర్‌ సమీక్ష

ABN , First Publish Date - 2022-07-23T01:51:52+05:30 IST

భారీ వర్షాలపై సీఎం కేసీఆర్‌ (CM KCR) ప్రగతి భవన్‌లో సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశానికి ఇరిగేషన్ శాఖ, ఇతర శాఖల ఉన్నతాధికారులు హాజరైనారు.

Heavy rains: భారీ వర్షాలపై ప్రగతి భవన్‌లో కేసీఆర్‌ సమీక్ష

హైదరాబాద్: భారీ వర్షాలపై సీఎం కేసీఆర్‌ (CM KCR) ప్రగతి భవన్‌లో సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశానికి ఇరిగేషన్ శాఖ, ఇతర శాఖల ఉన్నతాధికారులు హాజరైనారు. భారీ వర్షాల నేపథ్యంలో అధికారులు అప్రమత్తంగా ఉండాలని సీఎం ఆదేశించారు. ప్రాజెక్టుల నీటిమట్టాలపై అధికారులతో కేసీఆర్‌ సమీక్ష చేశారు. తెలంగాణ (Telangana)లో పలు జిల్లాల్లో ఆరెంజ్‌, ఎల్లో అలర్ట్‌ ప్రకటించారు. పలు జిల్లాల్లో ఎడతెరపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. ఐదు జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. అలాగే 18 జిల్లాల్లో భారీ వర్షాలు (Heavy rain) పడే అవకాశం ఉందని పేర్కొంది. ఈ రోజు ఉదయం నుంచి హైదరాబాద్‌ (Hyderabad)లో ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తోంది. వర్షానికి భాగ్యనగరం తడిసిముద్దవుతోంది.


మరో వైపు వరద నష్టాలపై కేంద్ర బృందం రాష్ట్రంలో పర్యటిస్తోంది. ఆదిలాబాద్‌, నిర్మల్‌ జిల్లాల్లో కేంద్ర బృందం పర్యటించింది. కేంద్ర బృందం ఆదిలాబాద్‌ (Adilabad) జిల్లాలోని ఉట్నూర్‌, ఇంద్రవెల్లి, ఇచ్చోడ, నేరడిగొండ మండలాల్లో ముంపు ప్రాంతాలను పరిశీలించి పంట నష్టంపై ఆరా తీసింది. ఉట్నూర్‌ మండల కేంద్రంలో పవర్‌ ప్రజంటేషన్‌ ద్వారా వరదల ఉధృతి, పంట నష్టాన్ని పరిశీలించింది. ఇచ్చోడ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వద్ద తెగిపోయిన బ్రిడ్జిని పరిశీలించింది. నిర్మల్‌ జిల్లా (Nirmal District)లోనూ కేంద్ర బృందం సభ్యులు పర్యటించారు. జిల్లా కలెక్టర్‌ ముషారఫ్‌ ఫారూఖీతో కలిసి కడెం ప్రాజెక్టు (Kadem project)ను సందర్శించారు. 

Updated Date - 2022-07-23T01:51:52+05:30 IST