వరంగల్ కు బయలు దేరిన సీఎం కేసీఆర్

ABN , First Publish Date - 2022-07-17T00:23:16+05:30 IST

వరదల నేపధ్యంలో గోదావరి పరీవాహక ప్రాంతంలో ఆదివారం చేపట్టనున్న ఏరియల్ సర్వే, పర్యటనలో భాగంగా ముఖ్యమంత్రి కేసీఆర్ శనివారం ప్రగతి భవన్ నుంచి వరంగల్ బయలుదేరి వెళ్లారు.

వరంగల్ కు బయలు దేరిన సీఎం కేసీఆర్

హైదరాబాద్: వరదల నేపధ్యంలో గోదావరి పరీవాహక ప్రాంతంలో ఆదివారం చేపట్టనున్న ఏరియల్ సర్వే, పర్యటనలో భాగంగా ముఖ్యమంత్రి కేసీఆర్ శనివారం ప్రగతి భవన్ నుంచి వరంగల్ బయలుదేరి వెళ్లారు. ముఖ్యమంత్రి కేసీఆర్ వెంట వైద్య ఆరోగ్యశాఖ మంత్రి హరీశ్ రావు, ఎంపీ సంతోష్ కుమార్, ఎమ్మెల్సీలు మధుసూదనా చారి, పల్లా రాజేశ్వరరెడ్డి, సీఎస్ సోమేశ్ కుమార్, పంచాయతీరాజ్, ఆర్అండ్ బి, వైద్య ఆరోగ్యవాఖల ఉన్నతాధికారులు ఉన్నారు. సాయంత్రం వరంగల్ చేరుకున్న తర్వాత సీఎం కేసీఆర్ వరద పరిస్థితులపై వరంగల్ ప్రాంత మంత్రులు, ఎమ్మెల్యేలు, ప్రజా ప్రతినిధులు, ఉన్నతాధికారులతో సమావేశం అవుతారు. 


ఆదివారం ఉదయం వరంగల్ నుంచి భద్రాచలం దాకా హెలీకాప్టర్ లో ఏరియల్ సర్వే నిర్వహించనున్నారు. భద్రాచలంలో పర్యటించి వరద ముంపు వల్ల సంభవించిన నష్టం, చేపడుతున్న వరద సహాయక చర్యలపై స్ధానిక మంత్రి పువ్వాడ అజయ్ కుమార్, ఎమ్మెల్యేలు, ప్రజా ప్రతినిధులు, అధికారులతో సమావేశం నిర్వహించనున్నారు. అక్కడి నుంచి ఏటూరు నాగారం ప్రాంతంలో ఏరియల్ సర్వే చేపట్టి అక్కడ కూడా దిగి, వరద సహాయక చర్యలను తెలుసుకుంటారు. 


అనంతరం ముఖ్యమంత్రి కేసీఆర్ ఏటూరు నాగారం నుంచి హైదరాబాద్ చేరుకుంటారు. సికింద్రాబాద్ ఉజ్జయినీ మహంకాళి బోనాల ఉత్సవాల్లో సీఎం కేసీఆర్ పాల్గొంటారు. సోమవారం ఉత్తర తెలంగాణలోని ఎస్సారెస్పీ, కడెం, కాళేశ్వరం తదితర వరద బాధిత ప్రాంతాలలో సీఎం కేసీఆర్ ఏరియల్ సర్వే నిర్వహించనున్నారు. ఈ సర్వేలో భాగంగా సీఎం కేసీఆర్ వరద బాధితులను పరామర్శించి వారికి భరోసా ఇవ్వనున్నారు

Updated Date - 2022-07-17T00:23:16+05:30 IST