
హైదరాబాద్: అంతా అయిపోయింది. ఇది ఎవరూ ఊహించని పరిణామం చినజీయార్కు అపర భక్తుడిగా పేరొందిన సీఎం కేసీఆర్.. ఆయనపై గుర్రుగా ఉన్నట్లు సమాచారం. యాదాద్రి లక్ష్మినరసింహస్వామి ఆలయ పున:ప్రారంభం పనుల కోసం చినజీయర్ ముందునుంచి అన్నీ తానై చూసుకున్నారు. ప్రముఖ అర్కిటెక్చర్ ఆనందసాయికి బాధ్యతలు అప్పగించాలని ముఖ్యమంత్రికి సూచించింది కూడా చినజీయర్ స్వామే. అలా యాదాద్రీశ్వరుని ఆలయం పనులు చూసుకున్న చినజీయర్‌కు కనీసం ఆహ్వానాన్ని కూడా పంపలేదు. అంగరంగ వైభవంగా జరుగుతున్న ఆలయ పున:నిర్మాణ కార్యక్రమంలో చినజీయర్ పేరు లేకపోవడం విస్తుపోయేలా చేస్తోంది.
ఇవి కూడా చదవండి