సీఎం కేసీఆర్ వరంగల్ టూర్ నేపథ్యంలో కరపత్రాల కలకలం

ABN , First Publish Date - 2021-06-21T17:31:29+05:30 IST

జిల్లాలో సీఎం కేసీఆర్ పర్యటనలో కలకలం రేగింది. వరంగల్ తూర్పు నియోజకవర్గంలో సీఎం కేసీఆర్ పర్యటన నేపథ్యంలో కరపత్రాలు హాట్ టాపిక్‌గా మారాయి.

సీఎం కేసీఆర్ వరంగల్ టూర్ నేపథ్యంలో కరపత్రాల కలకలం

వరంగల్ అర్బన్: జిల్లాలో సీఎం కేసీఆర్ పర్యటనలో కలకలం రేగింది. వరంగల్ తూర్పు నియోజకవర్గంలో సీఎం కేసీఆర్ పర్యటన నేపథ్యంలో కరపత్రాలు హాట్ టాపిక్‌గా మారాయి. తూర్పు ఎమ్మెల్యే నరేందర్ కబ్జాలకు పాల్పడ్డారంటూ పేరు తెలియని వ్యక్తులు కరపత్రాలు పంపిణీ చేశారు. న్యూస్ పేపర్‌లో పెట్టి వరంగల్ తూర్పులో పంపిణీ చేశారు. నేడు సీఎం కేసీఆర్ వరంగల్ టూర్‌ను దృష్టిలో పెట్టుకుని, ఎమ్మెల్యేపై ఆరోపణలు చేస్తూ కరపత్రాలు పంచినట్టుగా చర్చ జరుగుతోంది. మొన్నటి కార్పొరేషన్ ఎన్నికల్లో టిఆర్ఎస్ పార్టీ బీ ఫారమ్స్ 50 లక్షలకు అమ్ముకున్నాడని, గతంలో ములుగు జిల్లాలో ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల సమయంలోను ఇలాగే డబ్బులు వసూలు చేశారని కరపత్రాల్లో పేర్కొన్నారు. వరంగల్ తూర్పులో భూకబ్జాలు, అధికార పార్టీ నేతలపై వేధింపులు, సెటిల్ మెంట్ అంటూ ఘాటుగా ఆరోపణలు చేశారు. 

Updated Date - 2021-06-21T17:31:29+05:30 IST