సీఎం కేసీఆర్‌వి ఉత్తిమాటలే

ABN , First Publish Date - 2022-08-12T06:10:55+05:30 IST

సీఎం కేసీఆర్‌వి ఉత్తిమాటలే అని, చేతల్లో కనపడవని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ అన్నారు. మూడో విడత ప్రజా సంగ్రామ యాత్రలో భాగంగా తొమ్మిదో రోజైన గురువారం మండలంలోని సిరిపురం, రామన్నపేట, దుబ్బాక, మునిపంపుల గ్రామాల్లో పాదయాత్ర కొనసాగింది. ఈ సందర్భంగా మండల కేంద్రంలోని జ్యోతిబాపూలే, నేతాజీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించా రు.

సీఎం కేసీఆర్‌వి ఉత్తిమాటలే
రామన్నపేటలో బండి సంజయ్‌ సంగ్రామ యాత్ర

బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌


రామన్నపేట, ఆగస్టు 11: సీఎం కేసీఆర్‌వి ఉత్తిమాటలే అని, చేతల్లో కనపడవని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ అన్నారు.  మూడో విడత ప్రజా సంగ్రామ యాత్రలో భాగంగా తొమ్మిదో రోజైన గురువారం మండలంలోని సిరిపురం, రామన్నపేట, దుబ్బాక, మునిపంపుల గ్రామాల్లో పాదయాత్ర కొనసాగింది. ఈ సందర్భంగా మండల కేంద్రంలోని జ్యోతిబాపూలే, నేతాజీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించా రు. అనంతరం జరిగిన సభలో బండి సంజయ్‌ మాట్లాడుతూ ప్రజలను మోసగించి కేసీఆర్‌ కుటుంబ పాలన చేస్తున్నారని విమర్శించారు. కుటుంబ సభ్యులకు కమీషన్లు, కాం ట్రాక్టులు ఇస్తేనే పనులు చకచకా అవుతున్నాయని ఆరోపించారు. పేదలపై కేసీఆర్‌ కప ట ప్రేమ చూపుతూ అరాచక పాలన చేస్తున్నారనిఅన్నారు. నిజాం పాలన తలపిస్తున్న కేసీఆర్‌ ఖాసిం చంద్రశేఖర్‌ రిజ్వీ అన్నారు. పెట్రోల్‌, డీజిల్‌ ధరలు తగ్గించాలని కాంగ్రెస్‌ నా యకులు మాట్లాడడం సిగ్గుచేటని, పెట్రో ధరలపై రూ.30 కమిషన్‌ తీసుకుంటున్న కేసీఆర్‌ వాటికి బదులు చెప్పాలని అన్నారు. రైతులకు గిట్టుబాబు ధర కల్పించి, పంచాయతీలకు ఆర్థిక సంఘం ద్వారా కోట్ల రూపాయల నిధులు మంజూరు చేసిన ఘనత ప్రధాని నరేంద్ర మోదీకి దక్కుతుందన్నారు. నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి ఇవ్వాలని, వీఆర్‌ఏల న్యాయమైన డిమాండ్లను నెరవేర్చాలన్నారు. ఆదిలాబాద్‌ ఎంపీ సోయం బాపురావు మాట్లాడుతూ, తొమ్మిది రోజులుగా వర్షాన్ని సైతం లేక్క చేయకుండా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ ప్రజా సంగ్రామ యాత్ర నిర్వహించడం అభినందనీయమన్నారు. ఆయన యాత్రకు ప్రజలు అండగా నిలవాలని పిలుపునిచ్చారు. నిరుద్యోగులపై కపట ప్రేమ చూపుతూ మోసపూరిత ప్రకటనలు చేస్తున్న సీఎం కేసీఆర్‌ను గద్దె దించకపోతే ప్రజలను నట్టేట ముంచుతాడన్నారు. రైతులు, చేనేత కార్మికులు, దళితుల కోసం పాటుపడుతున్న ఏకైక ప్రభుత్వం నరేంద్ర మోదీ ప్రభుత్వమన్నారు. కాగా, పాదయాత్రగా వచ్చిన బండి సంజయ్‌ని సింగిల్‌ విండో డైరెక్టర్‌, బీజేపీ నేత కన్నెకంటి వెంకటేశ్వరచారి గజమాలతో సత్కరించి దట్టీ కట్టారు. కార్యక్రమంలో పార్టీ జిల్లా అధ్యక్షుడు పీవీ.శ్యాంసుందర్‌ రావు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బంగారు శృతి, మాజీ ఎమ్మెల్యే బూడిద భిక్షమయ్యగౌడ్‌, నాయకులు నకిరెకంటి మొగులయ్య, తాటిపాముల శివకృష్ణగౌడ్‌, మల్లేశం, ప్రభాకర్‌, శ్యామ్‌ తదితరులు పాల్గొన్నారు.

పాదయాత్ర సాగిందిలా..

బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌కుమార్‌ గురువారం మొత్తం 12.5కిలోమీటర్లు నడిచారు. రామన్నపేట మండలం సిరిపురం నుంచి రామన్నపేట, దుబ్బాక మీదుగా మునిపంపులకు చేరుకున్నారు. ఈ సందర్భంగా నాయకులు, మహిళలు సంజయ్‌ను పూలమాలలు శాలువాలతో సత్కరించి ఘనంగా స్వాగతం పలికారు. రామన్నపేట తహసీల్దార్‌ కార్యాలయం ఎదుట వీఆర్‌ఏలు చేస్తున్న ఆందోళనకు బండి సంజయ్‌ మద్దతు తెలిపారు. ఇల్లు లేక ఇస్త్రీ డబ్బాలో నివసిస్తున్న వృద్ధ దంపతులు ధనూరి బక్కమ్మ, శంకరయ్యలను పలకరించి వారి సమస్యలు తెలుసుకున్నారు. వారికి కొంత ఆర్థిక సహాయం చేసి అండగా ఉంటానని భరోసానిచ్చారు. వారికి ఇల్లు సహా ఇతర సౌకర్యాలు అందేలా ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలంటూ స్ధానిక నేతలకు సంజయ్‌ సూచించారు. కొబ్బరిబొండాలు విక్రయిస్తున్న మహిళతో మాట్లాడి ఆమెకు కొంత ఆర్థిక సహాయం చేశారు.  రామన్నపేటలో 6వ తరగతి విద్యార్థి సమీర్‌ను పలకరించారు. కాగా, ప్రజా సంగ్రామ యాత్ర 10 రోజైన శుక్రవారం మండలంలోని పల్లివాడ స్టేజ్‌, ఎన్నారం, పెద్దబావిగూడెం, కుంకుడుపాముల, నల్లగొండ జిల్లా నార్కట్‌పల్లి మండలం పల్లెపహాడ్‌ క్రాస్‌ రోడ్‌, అమ్మనబోలు వరకు సాగనుంది.

Updated Date - 2022-08-12T06:10:55+05:30 IST