మోదీకి మమత లేఖ

May 9 2021 @ 15:18PM

కోల్‌కతా : కోవిడ్-19 కోసం ఉపయోగించే అన్ని రకాల పరికరాలు, ఔషధాలపై అన్ని రూపాల్లోని పన్నులు, కస్టమ్స్ సుంకాలను రద్దు చేయాలని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమత బెనర్జీ డిమాండ్ చేశారు. వైద్య, ఆరోగ్య రంగంలో మౌలిక సదుపాయాలను పటిష్టపరచాలని, పరికరాలు, మందులు, ఆక్సిజన్ సరఫరాలను పెంచాలని కోరారు. ఈ మేరకు ఆమె ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి ఆదివారం ఓ లేఖ రాశారు. 


ఆక్సిజన్ సిలిండర్లు, కాన్సంట్రేటర్లు, కంటెయినర్లు, కోవిడ్ సంబంధిత ఔషధాలను అనేక మంది విరాళంగా ఇస్తున్నారని మమత తన లేఖలో పేర్కొన్నారు. వ్యక్తులు, సంస్థలు ఈ విధంగా విరాళాలిచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వాన్ని సంప్రదించినట్లు చెప్పారు. తమకు కస్టమ్స్ డ్యూటీ, ఎస్‌జీఎస్‌టీ, సీజీఎస్‌టీ, ఐజీఎస్‌టీల నుంచి మినహాయింపు ఇవ్వడంపై పరిశీలించాలని కోరారని చెప్పారు. 


ఈ అంశం కేంద్ర ప్రభుత్వ అధికార పరిధిలో ఉందని, కోవిడ్-19 చికిత్సకు ఉపయోగపడే పరికరాలు, ఔషధాలపై అన్ని రకాల పన్నులు, సుంకాలను రద్దు చేయాలని కోరారు. దీనివల్ల వీటి సరఫరాలో ఇబ్బందులు తొలగుతాయని తెలిపారు. 


Follow Us on:
అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.