నిరుద్యోగులతో చెలగాటమాడుతున్న సీఎం

ABN , First Publish Date - 2022-06-29T06:18:54+05:30 IST

నిరుద్యోగుల జీవితాలతో సీఎం కేసీఆర్‌ చెలగాటమాడుతున్నారని, రానున్న రోజుల్లో ఆయనకు వారే తగిన బుద్ధిచెబుతారనే విషయాన్ని గుర్తుంచుకోవాలని వైఎస్సాఆర్‌టీపీ అధ్యక్షురాలు షర్మిల అన్నారు. చివ్వెంల మండలం దురాజ్‌పల్లి నుంచి ఖాసీంపేట, మొదిన్‌పురం, జగ్గుతండా, సంగోనితండా మీదుగా పాండ్యానాయక్‌తండా వరకు సాగింది.

నిరుద్యోగులతో చెలగాటమాడుతున్న సీఎం
సూర్యాపేట జిల్లా మొదిన్‌పురంలో నిరుద్యోగ నిరాహార దీక్షలో వైఎస్‌ షర్మిల

రాష్ట్రంలో యువతకు తీరని అన్యాయం

వైఎస్‌ షర్మిల


చివ్వెంల, జూన్‌ 28: నిరుద్యోగుల జీవితాలతో సీఎం కేసీఆర్‌ చెలగాటమాడుతున్నారని, రానున్న రోజుల్లో ఆయనకు వారే తగిన బుద్ధిచెబుతారనే విషయాన్ని గుర్తుంచుకోవాలని వైఎస్సాఆర్‌టీపీ అధ్యక్షురాలు షర్మిల అన్నారు. చివ్వెంల మండలం దురాజ్‌పల్లి నుంచి ఖాసీంపేట, మొదిన్‌పురం, జగ్గుతండా, సంగోనితండా మీదుగా పాండ్యానాయక్‌తండా వరకు సాగింది. మొదిన్‌పురంలో ఆమె నిరుద్యోగ నిరాహార దీక్ష చేశారు. పాండ్యానాయక్‌తండాలో రైతులతో, వృద్ధులతో మాటాముచ్చట నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడు తూ జగదీ్‌షరెడ్డి గతంలో విద్యాశాఖ మంత్రిగా పనిచేసే సమయంలో 10 మందికి పైగా విద్యార్థులు, నిరుద్యోగులు ఆత్మహత్య చేసుకున్నా పట్టించుకోలేదన్నారు. టీఆర్‌ఎస్‌ పాలనలో ఇళ్లు లేవు, ఉద్యోగాలు రావని, వచ్చే మన ప్రభుత్వంలో ఆడబిడ్డల దగ్గర నుంచి ప్రతి కుటుంబాన్ని మనమే అభివృద్ధి చేసుకుందామన్నారు. రాష్ట్రంలో ప్రతీ కుటుంబంపై రూ.4లక్షల అప్పును సీఎం కేసీఆర్‌ పెట్టాడన్నారు. మిషన్‌ భగీరథ ఓ బోగస్‌ ప్రాజెక్ట్‌ అని, గ్రామాల్లో నేటికీ మంచి నీరు కరువైందన్నారు. హైదరాబాద్‌ నడిబొడ్డులో మైనర్‌ బాలికపై అత్యాచారం చేస్తే నేరస్థులకు బిర్యానీలు పెడుతున్నారంటే కేసీఆర్‌ పాలన మూర్ఖంగా ఉం దో అర్ధం చేసుకోవాలన్నారు. ప్రజలు రోడ్డున పడ్డారని, రుణమాఫీ విషయంలో రైతులు మోసపోయారన్నారు. రాష్ట్రంలో నిరుద్యోగుల ఆత్మహత్యలు, ముమ్మాటి కీ సీఎం కేసీఆర్‌ చేస్తున్న హత్యలేనని అన్నారు. రాష్ట్రంలో రెండు లక్షలకుపైగా ఖాళీలు ఉంటే ఇప్పటి వరకు 35వేల పోస్టులకే నోటిఫికేషన్లు వేసి టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం చేతులు దులుపుకుందన్నారు. ప్రకటించిన నోటిఫికేషన్లను నేటికీ పూర్తిచేయలేదన్నారు. రాష్ట్రంలో తిరిగి వైఎ్‌సఆర్‌ సంక్షేమ పాలన తీసుకరావడ మే తమ లక్ష్యమన్నారు. వైఎ్‌సఆర్‌ను ప్రేమించే ప్రతీ ఇంటిపై వైఎస్సాఆర్‌టీపీ జెండా ఎగరాలని అన్నారు. బడుగు, బలహీనవర్గాల కోసమే పనిచేస్తామని తెలిపారు. టీఆర్‌ఎస్‌ నాయకులు ఓట్ల కోసం డబ్బు ఇస్తే తీసుకోవాలని, ఎం దుకంటే అవి మీ డబ్బులే అని, ఓటు మాత్రం అభివృద్ధిచేసే వైఎస్సాఆర్‌టీపీకి వేయాలన్నారు. కాగా, 108వ రోజు ప్రజాప్రస్థాన పాదయాత్ర 7.9కి.మీ సాగింది. ఇప్పటివరకు మొత్తం 1,459.4కి.మీ మేర పాదయాత్ర సాగింది. కార్యక్రమంలో పార్టీ నియోజకవర్గ కోఆర్డినేటర్‌ పిట్టా రాంరెడ్డి, జిల్లా అధ్యక్షుడు జేవీఆర్‌, నీలం రమేష్‌, పాదయాత్ర కన్వీనర్‌ దేవరం లింగారెడ్డి, బీరెళ్లి శ్రీనివా్‌సరెడ్డి, సత్యవతి, పచ్చిపాల వేణుయాదవ్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2022-06-29T06:18:54+05:30 IST