పేద ప్రజలకు నాణ్యమైన విద్య అందించడమే సీఎం ధ్యేయం

ABN , First Publish Date - 2022-07-02T06:57:41+05:30 IST

పేదప్రజలకు నాణ్యమైన విద్య అందించడమే సీఎం కేసీఆర్‌ ధ్యేయమని అటవీ, దేవాదాయశాఖ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి స్పష్టం చేశారు.

పేద ప్రజలకు నాణ్యమైన విద్య అందించడమే సీఎం ధ్యేయం
విద్యార్థుల అభినందన సభలో మాట్లాడుతున్న మంత్రి

అటవీ, దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్‌ రెడ్డి 

నిర్మల్‌ కల్చరల్‌, జూలై 1 : పేదప్రజలకు నాణ్యమైన విద్య అందించడమే సీఎం కేసీఆర్‌ ధ్యేయమని అటవీ, దేవాదాయశాఖ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి స్పష్టం చేశారు. శుక్రవారం జిల్లాలో ఉత్తమర్యాంకులు సాధించిన టెన్త్‌ విద్యార్థులను మంత్రి ఒక ప్రయివేటు స్కూల్‌లో ఏర్పాటు చేసిన అభినందనసభలో సన్మా నించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. విద్యారంగంలో విప్లవాత్మక మార్పులు చోటు చేసుకున్నాయన్నారు. రాష్ట్రంలోనే జిల్లా రెండోస్థానంలో ఉండ డం గర్వకారణమని, ఇందుకు కారణమైన విద్యాశాఖ అధికారులు, ఉపాధ్యా యులను, ప్రోత్సహించిన తల్లిదండ్రులను అభినందించారు. ప్రైవేట్‌కు ధీటుగా ప్రభుత్వ పాఠశాలల్లో ఫలితాలు సాధించడం ప్రశంసనీయమని అన్నారు.  ఇంటర్‌ ఫలితాల్లో కొమురం భీం, ఆసిఫాబాద్‌ జిల్లా రెండో స్థానంలో నిలువడం పట్ల మంత్రి హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో చైర్మన్‌ ఈశ్వర్‌, కలెక్టర్‌ ముషారఫ్‌ ఫారూఖీ, అదనపు కలెక్టర్‌ హేమంత్‌ బోర్కడే, ఎంపీపీ రామేశ్వర్‌ రెడ్డి, డీఈవో రవీందర్‌రెడ్డి, తదితరులు పాల్గొన్నారు. విద్యాశాఖ సిబ్బంది, ఉపాధ్యాయ  సంఘ నాయకులు హాజరయ్యారు. 

జిల్లా కేంద్రాన్ని మోడల్‌ పట్టణంగా తీర్చిదిద్దుతాం..

నిర్మల్‌ చైన్‌గేట్‌, జూలై 1 : రాష్ట్రంలోనే నిర్మల్‌ పట్టణాన్ని మోడల్‌ పట్టణంగా తీర్చిదిద్దుతామని రాష్ట్ర మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి అన్నారు. శుక్రవారం జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం నుంచి గుల్జార్‌ మార్కెట్‌ మీదుగా పోస్టు ఆఫీసు వరకు నూతనంగా నిర్మిస్తున్న బీటీ రోడ్డు పనులను ఆయన పరిశీలించారు. పోస్టు ఆఫీసు నుంచి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం వరకు ఆయన పాదయాత్ర చేస్తూ పనులను దగ్గరుండి పర్యవేక్షించారు. నూతనంగా ఏర్పాటు చేసిన బస్తీ దవాఖానాను సందర్శించి సిబ్బందితో మాట్లాడారు. దవాఖానాలో సిబ్బంది హాజరు పట్టికను పరిశీలించారు. దేవరకోట ఆలయంలో జరుగుతున్న అభివృద్ది పనులను ఆయన సందర్శించారు. భోజనశాలకు రూ. 50 లక్షల నిధులను మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు. నిషాన్‌ వద్ద దర్గాకు ప్రహరీగోడను నిర్మిస్తున్నట్లు తెలిపారు. అనంతరం శివాజీనగర్‌లో నిర్మిస్తున్న మోడ్రల్‌ వైకుంఠధామం పనులనును పరిశీలించారు. ఈ కార్యక్రమంలో మాజీ డీసీసీబీ చైర్మన్‌ రాంకిషన్‌రెడ్డి , ఎఫ్‌ఎస్‌సీఎస్‌ చైర్మన్‌ ధర్మాజీ రాజేంధర్‌ , మున్సిపల్‌ చైర్మన్‌ గండ్రత్‌ ఈశ్వర్‌, టీఆర్‌ఎస్‌ పార్టీ పట్టణాధ్యక్షులు మారుగొండ రాము, దేవరకోట చైర్మన్‌ లింగంపల్లి లక్ష్మినారాయణ, పట్టణ కౌన్సిలర్‌లు, నాయకులు పాల్గొన్నారు. 

మంత్రిని కలిసిన టీఆర్‌ఎస్‌ పార్టీ నాయకులు

సోన్‌, జూలై 1 : విదేశీ పర్యటన ముగించుకొని వచ్చిన మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డిని మండల టీఆర్‌ఎస్‌ పార్టీ నాయకులు కలిశారు. శుక్రవారం మంత్రి నివాసగృహంలో కలిసి పుష్పగుచ్చం అందజేసి శుభాకాంక్షలు తెలియ జేశారు. అదే విఽధంగా మండలంలోని  సిద్దులకుంట, జాఫ్రాపూర్‌, కడ్తాల్‌, లోకల్‌ వెల్మల్‌, సాకేర గ్రామాలకు చెందిన లబ్ధిదారులకు ముఖ్యమంత్రి సహాయ నిధి మంజూరైన ఐదులక్షల యాభై వేల రూపాయల చెక్కులను మంత్రి చేతుల మీదుగా అందజేశారు. ఈ కార్యక్రమంలో పీఏసీఎస్‌ చైర్మన్‌ అంపోలి కృష్ణ ప్రసాద్‌ రెడ్డి, టీఆర్‌ఎస్‌ మండల పార్టీ అధ్యక్షుడు మోహీనుద్దీన్‌, నాయకులు బండి లింగన్న, రాము, తదితరులు ఉన్నారు. 

Updated Date - 2022-07-02T06:57:41+05:30 IST