ఈ రోజు నుంచి ప్రభుత్వ ఆసుపత్రులలో పాటు ప్రైవేటు ఆసుపత్రులలో కూడా కరోనా టీకాలు వేయనున్నారు. ఇందుకోసం ఏర్పాట్లు పూర్తి చేశారు. అయితే రిజిస్ట్రేషన్ చేయించుకున్న తరువాతనే వ్యాక్సిన్ వేయనున్నారు. బీహార్‌లో మొత్తం 1600 కేంద్రాలలో కరోనా టీకాలను వేయనున్నారు. ఒక్కో వ్యాక్సినేషన్ కేంద్రంలో రోజుకు వందమందికి టీకాలు వేసేందుకు ఏర్పాట్లు చేశారు.