మోదీ, జగన్‌ ఆ విషయంలో పోటీ పడుతున్నారు: రామకృష్ణ

ABN , First Publish Date - 2022-04-05T16:44:07+05:30 IST

ప్రధానమంత్రి నరేంద్రమోదీ, ఏపీ సీఎం జగన్మోహన్‌రెడ్డి పోటీ పడుతూ ప్రజల పైను భారాలు మోపుతున్నారని సీపీఐ రామకృష్ణ ఆగ్రహం వ్యక్తం చేశారు.

మోదీ, జగన్‌ ఆ విషయంలో పోటీ పడుతున్నారు: రామకృష్ణ

విజయవాడ: ప్రధానమంత్రి నరేంద్రమోదీ, ఏపీ సీఎం జగన్మోహన్‌రెడ్డి పోటీ పడుతూ ప్రజలపై పెను భారాలు మోపుతున్నారని సీపీఐ రామకృష్ణ  ఆగ్రహం వ్యక్తం చేశారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ‘‘పెంచిన విద్యుత్ ఛార్జీలతో పాటు, ఆగస్టులో మరోసారి ధరలతో బాదనున్నారు.పేద, మధ్య తరగతి ప్రజలకు జగన్ కరెంటు షాక్ ఇచ్చాడు. పోలవరం విషయంలో మోదీ, జగన్మోహన్‌రెడ్డి పక్కా డ్రామా ఆడుతున్నారు.ఏప్రిల్ 19వ తేదీన ఛలో పోలవరానికి పిలుపిస్తున్నాం. జిల్లాల పునర్విభజనకు తాము అనుకూలమే అయినా..  ప్రజాస్వామ్య పద్ధతిలో ప్రక్రియ చేయలేదు.అసెంబ్లీలో, క్యాబినెట్‌లో కూడా చర్చ పెట్టలేదు.నియోజకవర్గం ఎమ్మెల్యేలతో సంప్రదింపులు జరపలేదు.12వేల మంది అభిప్రాయాలను చెబితే.. ఎందుకు పరిగణలోకి తీసుకోలేదు.విపక్షాలే కాదు... సొంత పార్టీ సభ్యులు చెప్పినా జగన్  స్పందించ లేదు.ఇంగిత జ్ఞానం జగన్‌కు లేదని నిరూపించుకున్నారు.అఖిలపక్ష సమావేశం ఏర్పాటు ఎందుకు చేయలేదో జగన్ చెప్పాలి’’ అని సీపీఐ రామకృష్ణ డిమాండ్ చేశారు. 


‘‘టీడీపీ అధినేత చంద్రబాబుకు వ్యతిరేకంగా తాము పెట్టిన సభలకు మంత్రి పేర్నినాని రాలేదా.? అప్పుడు వామపక్షాలు మాట్లాడలేదని నాని ఎలా అంటారు.? వైసీపీ వైఫల్యాలను ప్రశ్నిస్తే చంద్రబాబు పేరు ప్రస్తావిస్తారు.జిల్లాల ఏర్పాటు వైసీపీ సొంత వ్యవహారం అనుకుంటున్నారా.?చంద్రబాబుతో పోల్చుకుంటున్న వైసీపీ నేతలు... ఆయనలాగా... ఇంటికెళ్లేందుకు సిద్ధంగా ఉండండి.ఇప్పుడయినా అఖిల పక్ష సమావేశం ఏర్పాటు చేయండి.మూడేళ్ల జగన్ పాలనలో ఎవరికైనా అపాయింట్మెంట్ ఇచ్చారా.?పేర్ని నాని విపక్షంలో ఒక విధంగా, అధికారం వచ్చాక మరోలా మాట్లాడితే ఎలా..?నాని... నీ బ్లాక్ మెయిల్ రాజకీయాలు మానుకో..? వైసీపీ ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా తమ పోరాటం కొనసాగిస్తాం’’ అని  రామకృష్ణ హెచ్చరించారు. 

Updated Date - 2022-04-05T16:44:07+05:30 IST