ఆపదలో అభయ హస్తం సీఎం సహాయనిధి

ABN , First Publish Date - 2022-07-07T05:17:13+05:30 IST

ఆపదలో ఉన్న వారికి సీఎం సహాయ నిధి అభయ హస్తమని అలంపూర్‌ ఎమ్మెల్యే అబ్రహాం అన్నారు.

ఆపదలో అభయ హస్తం సీఎం సహాయనిధి
లబ్ధిదారుకు సీఎం సహాయ నిధి చెక్కును అందిస్తున్న ఎమ్మెల్యే అబ్రహాం

- అలంపూర్‌ ఎమ్మెల్యే అబ్రహాం

- లబ్ధిదారులకు చెక్కుల పంపిణీ

అలంపూర్‌ చౌరస్తా, జులై 6 : ఆపదలో ఉన్న వారికి సీఎం సహాయ నిధి అభయ హస్తమని అలంపూర్‌ ఎమ్మెల్యే అబ్రహాం అన్నారు. నియోజకవర్గంలోని వివిధ మండలాలకు చెందిన ఎనిమిది మందికి సీఎం సహాయనిధి ద్వారా రూ.2.56 లక్షలు మంజూరయ్యాయి. దీనికి సంబంధించిన చెక్కులు, ఎల్‌వోసీలను ఆయన బుధవారం అలంపూర్‌ చౌరస్తాలోని క్యాంపు కార్యాలయంలో బాధితులకు అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రం లక్షలాది మంది ప్రాణాలు కాపాడిన ఘనత సీఎం కేసీఆర్‌కే దక్కుతుందని అన్నారు. కార్యక్రమంలో రైతు సమన్వయ సమితి అధ్యక్షుడు జల్లాపురం వెంకటేశ్వర్లు, టీఆర్‌ఎస్‌ మానవపాడు మండల అధ్యక్షుడు నాగేశ్వరరెడ్డి, బీవీ రమణ, అలంపూర్‌ మునిసిపల్‌ కౌన్సిలర్‌ సుష్మ, నాయకులు కృష్ణగౌడు, రాముడు, అంజనేయులు, ఉరుకుందు, బాడేసాబ్‌, వెంకటేష్‌ పాల్గొన్నారు. 


కార్యకర్తలే పార్టీకి పునాది

రాజోలి :  టీఆర్‌ఎస్‌ పార్టీకి కార్యకర్తలే గట్టి పునాది అని, వారికి పార్టీ అండగా ఉంటుందని అలంపూర్‌ ఎమ్మెల్యే అబ్రహాం అన్నారు. మండలంలోని తుమ్మిళ్ల గ్రామంలో టీఆర్‌ఎస్‌ పార్టీ కార్యకర్త నల్లబోతుల సుజాత ఇటీవల మృతి చెందింది. ఆమెకు పార్టీ సభ్యత్వం ఉన్నందున, ఆమె కుటుంబ సభ్యులకు రెండు లక్షల రూపాయలు జీవిత బీమా మంజూరయ్యింది. దీనికి సంబంధించిన చెక్కును బాధిత కుటుంబసభ్యులకు ఎమ్మెల్యే అబ్రహాం అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లే బాధ్యత కార్యకర్తలదేనన్నారు. కార్యక్రమంలో ఆర్డీఎస్‌ సాగునీటి సంఘం మాజీ చైర్మన్‌ తనగల సీతారామిరెడ్డి, వైస్‌ ఎంపీపీ రేణుక, సర్పంచులు తిరుమల్‌రెడ్డి, భూషణం,  శ్రీరామ్‌రెడ్డి, గంగిరెడ్డి, గోపాల్‌రెడ్డి పాల్గొన్నారు.

Updated Date - 2022-07-07T05:17:13+05:30 IST