‘ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పటికీ నా చెవుల్లో మారుమ్రోగుతున్నాయి’

ABN , First Publish Date - 2022-05-03T14:18:16+05:30 IST

తమ పార్టీ అధికారంలో ఉన్నా లేకపోయినా తమిళుల కోసం ఎల్లవేళలా అండగా, గొంతుకగా ఉంటామని ముఖ్యమంత్రి స్టాలిన్‌ పునరుద్ఘాటించారు. వివిధ పార్టీలకు

‘ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పటికీ నా చెవుల్లో మారుమ్రోగుతున్నాయి’

- అధికారంతో పనిలేదు.. ఎల్లవేళలా అండగా ఉంటాం

- సీఎం స్టాలిన్‌ పునరుద్ఘాటన

- డీఎంకేలో చేరిన 3 వేల మంది 


అడయార్‌(చెన్నై): తమ పార్టీ అధికారంలో ఉన్నా లేకపోయినా తమిళుల కోసం ఎల్లవేళలా అండగా, గొంతుకగా ఉంటామని ముఖ్యమంత్రి స్టాలిన్‌ పునరుద్ఘాటించారు. వివిధ పార్టీలకు చెందిన సుమారు 3 వేల మంది నేతలు, కార్యకర్తలు ముఖ్యమంత్రి సమక్షంలో డీఎంకేలో చేరారు.  సోమవారం తేనాంపేటలోని అన్నా అరివాలయంలో జరిగిన కార్యక్రమంలో ముఖ్యమంత్రి స్టాలిన్‌ మాట్లాడుతూ... 72 యేళ్ళ చరిత్ర ఉన్న డీఎంకే మరో మూడేళ్ళలో ప్లాటినం జూబ్లి జరుపుకోనున్నట్టు చెప్పారు. డీఎంకే విషయానికి వస్తే అధికారంలో ఉన్నా లేకపోయినా తమిళుల కోసం నిరంతరం అండగా, వారి అభ్యున్నతికి కృషి చేస్తూనే ఉంటామన్నారు. డీఎంకే అధికారంలోకి రావడం  ముఖ్యమంత్రిగా అన్నాదురై ఉండటం వల్ల రాష్ట్రానికి తమిళనాడు అనే పేరు పెట్టడం జరిగిందన్నారు. ఆ సమయంలో అన్నాదురై తీవ్ర అనారోగ్యానికి గురికావడంతో చికిత్స కోసం అమెరికా వెళ్లగా,  ఆపరేషన్‌ అనంతరం ఆయన స్వదేశానికి తిరిగి వచ్చిన రోజునే రాష్ట్రం పేరు తమిళనాడు అని ఖరారు చేస్తూ ప్రకటన వచ్చిందన్నారు. ఆ రోజు జరిగే వేడుకల్లో వైద్యుల సూచన, కుటుంబ సభ్యుల అభ్యంతరాలను పక్కనబెట్టి అన్నాదురై పాల్గొన్నారని గుర్తుచేశారు. ఆ వేడుకల్లో అన్నాదురై అన్న వ్యాఖ్యలు ఇప్పటికీ తన చెవుల్లో మారుమ్రోగుతున్నాయన్నారు. రాష్ట్రానికి తమిళనాడు అనే పేరు పెట్టడానికి ప్రధాన కారణం డీఎంకే అని పేర్కొన్నారు. తమిళ భాషకు సెమ్మెళి హోదా (క్లాసికల్‌ లిటరేచర్‌)ను పొందేందుకు కలైంఙ్ఞర్‌ ఏ విధంగా పోరాడారో, వాదించారో ప్రతి ఒక్కరికీ తెలుసని, ఆయన కృషి ఫలితంగానే తమిళ భాషకు క్లాసికల్‌ లిటరేచర్‌ అనే పేరు వచ్చిందన్నారు. అన్నాదురై, కరుణానిధి చూపిన మార్గాల్లో తన పాలన సాగుతుందన్నారు.  

Read more