మమ్మల్నే నాశనం చేయాలనుకున్నారు..

ABN , First Publish Date - 2022-06-24T13:15:23+05:30 IST

తమ పార్టీని పతనం చేసేందుకు డీఎంకే ప్రయత్నిస్తోందంటూ అన్నాడీఎంకే నేతలు చేస్తున్న వ్యాఖ్యలపై ముఖ్యమంత్రి స్టాలిన్‌ స్పందించారు. వారి విషయంలో

మమ్మల్నే నాశనం చేయాలనుకున్నారు..

                       - ఆపార్టీ విషయాల్లో జోక్యం చేసుకోం

                       - Cm Stalin


ప్యారీస్‌(చెన్నై), జూన్‌ 23: తమ పార్టీని పతనం చేసేందుకు డీఎంకే ప్రయత్నిస్తోందంటూ అన్నాడీఎంకే నేతలు చేస్తున్న వ్యాఖ్యలపై ముఖ్యమంత్రి స్టాలిన్‌ స్పందించారు. వారి విషయంలో జోక్యం చేసుకోవాల్సిన అవసరం తమకు లేదని స్పష్టం చేశారు. తిరువాన్మియూర్‌లో గురువారం ఉదయం రాష్ట్ర రెవెన్యూశాఖ మంత్రి, పార్టీ కార్యదర్శి రామచంద్రన్‌ ఇంట్లో జరిగిన వివాహ వేడుకల్లో ముఖ్యమంత్రి స్టాలిన్‌ సతీసమేతంగా పాల్గొని వధూవరులను ఆశీర్వదించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... మా ఇంటి కల్యాణం అన్నట్లు ఈ వేడుకల్లో మంత్రులు, ఎమ్మెల్యే, పలు పార్టీల నేతలు, కార్యకర్తలు పాల్గొని వధూవరులను ఆశీర్వదిస్తున్నారన్నారు. మరోవైపు మరో కల్యాణ మండపంలో జరుగుతున్న వ్యవహారం ప్రజలందరికీ తెలుసంటూ ‘శ్రీవారు కల్యాణమండపంలో జరిగిన అన్నాడీఎంకే సర్వసభ్య సమావేశ మండలి తంతు గురించి నర్మగర్భ వ్యాఖ్యలు చేశారు. తమను నాశనం చేయాలనుకున్నవారి వ్యవహారంలో జోక్యం చేసుకోవాల్సిన అవసరం లేదని స్టాలిన్‌ స్పష్టం చేశారు.

Updated Date - 2022-06-24T13:15:23+05:30 IST