Statement by Chief Minister Stalin: పారిశ్రామిక ప్రగతే లక్ష్యం

ABN , First Publish Date - 2022-08-03T14:35:16+05:30 IST

ద్రావిడ తరహా పాలన అందిస్తున్న డీఎంకే ప్రభుత్వం(DMK Govt) చిన్న, మధ్య తరహా పరిశ్రమలను ప్రోత్సహిస్తుందని ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్‌

Statement by Chief Minister Stalin: పారిశ్రామిక ప్రగతే లక్ష్యం

- చిన్న, మధ్యతరహా పరిశ్రమలకు ప్రోత్సాహం 

- రూ.54 కోట్లతో రాష్ట్ర సాంకేతిక స్టార్టప్‌ సెంటర్‌ 

- సీఎం స్టాలిన్‌ 


చెన్నై, ఆగస్టు 2 (ఆంధ్రజ్యోతి): ద్రావిడ తరహా పాలన అందిస్తున్న డీఎంకే ప్రభుత్వం(DMK Govt) చిన్న, మధ్య తరహా పరిశ్రమలను ప్రోత్సహిస్తుందని ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్‌ పేర్కొన్నారు. నందంబాక్కం ట్రేడ్‌ సెంటర్‌లో చిన్న, మధ్యతరహా పరిశ్రమలశాఖ మంత్రి దోమా అన్బరసన్‌ అధ్యక్షతన మంగళవారం ఉదయం స్టార్టప్‌ కంపెనీలు, ఇంక్యుబేటర్ల ప్రతినిధుల సదస్సు, ప్రదర్శనను ప్రారంభించిన అనంతరం సీఎం మాట్లాడుతూ అందరికీ అన్ని వసతుల కల్పనే ప్రధాన లక్ష్యంగా తమ ప్రభుత్వం పారిశ్రామిక ప్రగతిని సాధించేందుకు చర్యలను చేపడుతోందన్నారు. గతంలో కొత్త పరిశ్రమల స్థాపనకు అనువైన రాష్ట్రాల్లో తమిళనాడు 14వ స్థానంలో ఉండేదని, డీఎంకే ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన యేడాదిలోపే తృతీయ స్థానానికి ఎగబాకిందని చెప్పారు. ‘స్టార్టప్‌ తమిళనాడు’(Startup Tamil Nadu) పేరుతో నిర్వహిస్తున్న సదస్సులో 98 కొత్త పరిశ్రమలు తమ ఉత్పత్తులతో ఎగ్జిబిషన్‌ కూడా ఏర్పాటు చేయడం తనకెంతో సంతోషాన్ని కలిగిస్తోందన్నారు. కొత్త పరిశ్రమల రూపకల్పన దిశగా అన్నా విశ్వవిద్యాలయం ప్రాంగణంలో రూ.54.6 కోట్లతో  రాష్ట్ర సాంకేతిక స్టార్టప్‌ సెంటర్‌ ఏర్పాటు చేయనున్నామని ఆయన చెప్పారు. ఐఐటీ పరిశోధన కేంద్రం తరహాలో ఈ కేంద్రం కొత్తగా పరిశ్రమలను స్థాపించే ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలక సలహాలు సూచనలు అందించి వారికి నిధులను సమకూర్చేందుకు కూడా సహాయపడుతుందని వివరిం చారు. ఈ కార్యక్రమంలో మంత్రులు పళనివేల్‌ త్యాగరాజన్‌, సెంజి మస్తాన్‌, పి. మూర్తి, రాజ్యసభ సభ్యులు అందియూరు సెల్వరాజ్‌, శాసనసభ్యులు ఇ. కరుణానిధి, భూమినాథన్‌, స్టార్టప్‌ ఇండియా అధ్యక్షుడు అస్తా గ్రోవర్‌ తదితరులు పాల్గొన్నారు.


కొత్త ఎయిర్‌పోర్టు ఆర్థిక ప్రగతికి సోపానం...

పరందూరులో రూ.20 వేల కోట్లతో నిర్మించనున్న కొత్త విమానాశ్రయం రాష్ట్ర ఆర్థిక ప్రగతికి సోపానమవుతుందని ముఖ్యమంత్రి స్టాలిన్‌ పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించిన నాలుగు ప్రాంతాల్లో ఒకటైన పరందూరులో కొత్త విమానాశ్రయం ఏర్పాటుకు కేంద్ర విమానయాన సంస్థ ఎంపిక చేయడం హర్షణీయమని తెలిపారు. ఈ మేరకు మంగళవారం ఆయన ఓ ప్రకటన విడుదల చేస్తూ ప్రస్తుతం మీనంబాక్కం విమానాశ్రయం యేడాదికి 2.2కోట్ల మంది ప్రయాణికులకు సేవలందిస్తుండగా పరందూరు విమానాశ్రయం(Airport)లో యేడాదికి పదికోట్ల మంది ప్రయాణికులకు మెరుగైన సేవలందించగలుతుందని తెలిపారు. రెండు పొడవైన రన్‌వేలు, టెర్మినల్స్‌, టాక్సీవేస్‌, విమానాల పార్కింగ్‌ స్థలాలు, కార్గో టెర్మినల్‌ ఇలా సకల సదుపాయాలు కొత్త విమానాశ్రయంలో ఉంటాయని సీఎం తెలిపారు. 

Updated Date - 2022-08-03T14:35:16+05:30 IST