
చెన్నై: ఇటీవలి వర్షాలకు దెబ్బతిన్న సెమ్మంజేరి ప్రాంతాల్లో మంగళవారం ఉదయం రాష్ట్ర ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ అధికారులతో కలిసి పరిశీలించారు. సెమ్మంజేరి కుమరన్నగర్లోని ప్రత్యేక వైద్య శిబిరాన్ని తనిఖీ చేశారు. ఆ తర్వాత ఓక్కియం మేడు వద్దనున్న కారపాక్కం చెరువు వద్ద ఏర్పడిన వరద పరిస్థితులను పరిశీలించారు. స్టాలిన్‌తోపాటు మంత్రి ఎం. సుబ్రమణ్యం, శాసనసభ్యుడు ఎస్.అరవింద్ రమేష్, గ్రేటర్ చెన్నై కార్పొరేషన్ కమిషనర్ గగన్‌దీప్ సింగ్ బేదీ, ఉపాధి కల్పనా, శిక్షణా విభాగం సంచాలకులు కె. వీరరాఘవరావు తదితరులు పర్యటించారు.